ది ప్యారడైజ్ : ఏపీ టికెట్ ధరలు ఖరారు.. ప్రీమియర్స్ అండ్ ఫస్ట్ వీక్ రేట్స్ ఇవే..!

ది ప్యారడైజ్ : ఏపీ టికెట్ ధరలు ఖరారు.. ప్రీమియర్స్ అండ్ ఫస్ట్ వీక్ రేట్స్ ఇవే..!

Published on Sep 21, 2026 9:13 PM IST

న్యాచురల్ స్టార్ నాని, శ్రీకాంత్ ఓదెల కాంబినేషన్‌లో వస్తున్న మోస్ట్ అవైటెడ్ పాన్ ఇండియా చిత్రం ‘ది ప్యారడైజ్’కు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం టికెట్ ధరలను పెంచుతూ జీవో జారీ చేసింది. సెప్టెంబర్ 23న జరగనున్న గ్రాండ్ ప్రీమియర్ షోల కోసం సింగిల్ స్క్రీన్స్ టికెట్ ధర గరిష్టంగా రూ. 300, మల్టీప్లెక్స్‌లలో రూ. 400 గా నిర్ణయించారు. అత్యంత భారీ అంచనాల నడుమ వస్తున్న ఈ సినిమా ప్రీమియర్స్ కోసం తెలుగు రాష్ట్రాల్లో నాని అభిమానులు, సినీ ప్రియులు తీవ్ర ఆసక్తితో ఎదురుచూస్తున్నారు.

ఇక సినిమా విడుదలైన మొదటి రోజు నుంచి పదో రోజు వరకు ఆంధ్రప్రదేశ్‌లో రీజనబుల్ టికెట్ ధరలను అందుబాటులోకి తెచ్చారు. ఈ పది రోజుల వ్యవధిలో సింగిల్ స్క్రీన్‌లలో టికెట్ ధర గరిష్టంగా రూ. 197.50 గాను, మల్టీప్లెక్స్‌లలో రూ. 254 గాను నిర్ణయించారు. మేకర్స్ తీసుకున్న ఈ నిర్ణయం సాధారణ ప్రేక్షకులకు, కుటుంబ సమేతంగా వచ్చే సినిమా ప్రియులకు పెద్ద ఊరటగా నిలవనుంది.

కయాదు లోహర్, మోహన్ బాబు, సంపూర్ణేష్ బాబు తదితరులు కీలక పాత్రల్లో నటించిన ఈ చిత్రానికి అనిరుధ్ రవిచందర్ సంగీతం అందిస్తున్నాడు. ఎస్ఎల్‌వి సినిమాస్ బ్యానర్ పై సుధాకర్ చెరుకూరి ఈ చిత్రాన్ని ప్రొడ్యూస్ చేస్తు్న్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు