అమెజాన్ ప్రైమ్ లో టాప్ లో ట్రెండ్ అవుతోన్న “షేర్ షా” చిత్రం

Published on Aug 31, 2021 1:40 pm IST


ఇండియన్ ఆర్మీ కెప్టెన్ విక్రమ్ బట్ర జీవిత గాథ ఆధారంగా తెరకెక్కిన చిత్రం షేర్ షా. 1999 కార్గిల్ వార్ లో ఆయన చేసిన సాహసాలకు భారత ప్రభుత్వం పరమ వీర చక్ర ను ప్రధానం చేసింది. అయితే ఈ షేర్ షా చిత్రం లో సిద్దార్థ్ మల్ హోత్రా హీరోగా నటించగా, కియారా అద్వానీ హీరోయిన్ గా నటించడం జరిగింది.

ఈ చిత్రం ప్రస్తుతం అమెజాన్ ప్రైమ్ వీడియో లో ప్రసారం అవుతుంది. ఇప్పటి వరకు ఎక్కువ మంది చూసిన చిత్రం గా షేర్ షా నిలిచింది అని అమెజాన్ ప్రైమ్ వీడియో తాజాగా తెలిపింది. 4,100 సిటీలు మరియు పట్టణాల్లో ఈ చిత్రాన్ని వీక్షించారు అని, 210 కి పైగా దేశాల్లో ఈ చిత్రాన్ని చూసినట్లు తెలిపారు. హిందీ భాషా చిత్రాల్లో మోస్ట్ పాపులర్ చిత్రం గా IMDb 8.9 రేటింగ్ ఇచ్చిన విషయాన్ని వెల్లడించారు. అయితే ఈ చిత్రం పై చూపిస్తున్న ఆదరణ పట్ల హీరోయిన్ కియార అద్వానీ థాంక్స్ చెబుతూ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.

సంబంధిత సమాచారం :