దబాంగ్ 3 షూటింగ్ లో జాయిన్ కానున్న సౌత్ స్టార్ హీరో !

Published on May 5, 2019 9:00 pm IST

బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్, సోనాక్షి సిన్హా జంటగా నటిస్తున్న చిత్రం దబాంగ్ 3. ఇటీవలే ఈచిత్రం మొదటి షెడ్యూల్ కంప్లీట్ చేసుకోగా ప్రస్తుతం రెండవ షెడ్యూల్ షూటింగ్ జరుగుతుంది. ఈ షెడ్యూల్ లో కన్నడ స్టార్ హీరో కిచ్చా సుధీప్ జాయిన్ కానున్నాడు. ఈ చిత్రంలో ఆయన ప్రతినాయకుడి పాత్రలో కనిపించనున్నాడు.

ప్రభుదేవా డైరెక్ట్ చేస్తున్న ఈచిత్రానికి సాజిద్ -వాజిద్ సంగీతం అందిస్తుండగా సల్మాన్ ఖాన్ , అర్బాజ్ ఖాన్ నిర్మిస్తున్నారు. ఇక దబాంగ్ సిరీస్ లో వచ్చిన మొదటి రెండు చిత్రాలు సూపర్ హిట్ అవ్వడంతో ఈ మూడవ చిత్రం ఫై భారీ అంచనాలు వున్నాయి. ఈ ఏడాది డిసెంబర్ 21న ఈ చిత్రం విడుదలకానుంది.

సంబంధిత సమాచారం :

More