సెప్టెంబర్ 12న `ప‌హిల్వాన్‌` !

Published on Jul 24, 2019 6:01 pm IST

‘ఈగ’ ఫేమ్ కిచ్చా సుదీప్ టైటిల్ పాత్ర‌లో న‌టిస్తున్న చిత్రం `ప‌హిల్వాన్‌`. ఈ సినిమాను ప్ర‌ముఖ నిర్మాణ సంస్థ వారాహి చ‌ల‌న చిత్రం తెలుగు ప్రేక్ష‌కుల‌కు అందించ‌నున్నారు. ఈ యాక్ష‌న్ డ్రామాలో సుదీప్ రెజ్ల‌ర్ పాత్ర‌లో క‌నిపిస్తారు. తెలుగులోనూ `ప‌హిల్వాన్‌` అనే పేరుతో సెప్టెంబర్ 12న ఈ చిత్రాన్ని విడుద‌ల కానుందని పోస్టర్ ద్వారా అధికారికంగా ప్రకటించింది.

ఎస్‌.కృష్ణ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతోన్న ఈ చిత్రంలో బాలీవుడ్ న‌టుడు సునీల్ శెట్టి, ఆకాంక్ష సింగ్ కీల‌క పాత్ర‌ల్లో న‌టిస్తున్నారు. రీసెంట్‌గా మెగాస్టార్ చిరంజీవి విడుద‌ల చేసిన `ప‌హిల్వాన్` ఫ‌స్ట్ లుక్ పోస్ట‌ర్‌కు మంచి స్పంద‌న వ‌చ్చింది. అలాగే ఫ‌స్ట్ లిరిక‌ల్ వీడియో కూడా విడుద‌లైంది. అర్జున్ జ‌న్యా సంగీతం అందించిన ఈ సినిమాకు క‌రుణాక‌ర్ సినిమాటోగ్ర‌ఫీ అందించారు. `కె.జి.య‌ఫ్‌` చిత్రాన్ని తెలుగులో విడుద‌ల చేసి ఘ‌న విజ‌యాన్ని అందుకున్న వారాహి చ‌ల‌న చిత్రం ఇప్పుడు `ప‌హిల్వాన్‌` చిత్రాన్ని గ్రాండ్ రిలీజ్ చేస్తోంది.

సంబంధిత సమాచారం :