యాక్షన్ మోడ్ లో రవితేజ ‘కిక్ 2’

Kick2
మాస్ మహారాజ రవితేజ కెరీర్లో కమర్షియల్ గానే కాకుండా తన కెరీర్ కి బిగ్గెస్ట్ బూస్టప్ ఇచ్చిన సినిమా ‘కిక్’. ఈ సినిమా చూసిన ప్రతి ఒక్కరూ రవితేజ మాత్రమే ఆ సినిమా చేయగలడని అన్నారు. ఇప్పుడు అదే సినిమాకిఅతి మనకు తెలిసిందే. ఫస్ట్ పార్ట్ కి కొనసాగింపుగా ఆ పార్ట్ లోని రవితేజ – ఇలియానాల వారసుడి కథని ఆధారం చేసుకొని ఈ సినిమా చేస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా లేటెస్ట్ షెడ్యూల్ గత కొద్ది రోజులుగా హైదరబాద్ లో జరుగుతోంది. ప్రసతుతం ఈ సినిమాలో రవితేజ – రవికిషన్ మధ్య వచ్చే ఓ భారీ యాక్షన్ ఎపిసోడ్ ని రామోజీ ఫిల్మ్ సిటీలో షూట్ చేస్తున్నారు.

ఈ యాక్షన్ ఎపిసోడ్ కి రామ్ – లక్ష్మణ్ మాస్టర్ స్టంట్స్ కంపోజ్ చేస్తున్నారు. రవితేజ సరసన రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్ గా నటిస్తోంది. ఈ చిత్ర టీం ఇటీవలే హంపి వెళ్లి అక్కడి లొకేషన్స్ లో కొన్ని కీలక సన్నివేశాలను షూట్ చేసారు. దాదాపు చివరి దశకు చేరుకుంటున్న ఈ సినిమాని సమ్మర్ కానుకగా మే 7న రిలీజ్ చెయ్యడానికి ప్లాన్ చేస్తున్నారు. ఈ సినిమాని నందమూరి కళ్యాణ్ రామ్ ఎన్.టి.ఆర్ ఆర్ట్స్ బ్యానర్ పై నిర్మిస్తున్నాడు.

Exit mobile version