గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో పాల్గొన్న బిగ్ బి తో నాగ్.!

Published on Jul 27, 2021 5:00 pm IST


బాలీవుడ్ లెజెండరీ నటులు, బిగ్ బి అమితాబ్ బచ్చన్ ప్రస్తుతం పాన్ ఇండియన్ స్టార్ ప్రభాస్ మరియు టాలెంటెడ్ దర్శకుడు నాగ్ అశ్విన్ కలయికలో తెరకెక్కిస్తున్న పాన్ వరల్డ్ చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. గత వారం హైదరాబాద్ కి అమితాబ్ కొన్ని రోజులు షూట్ నిమిత్తం ఈ చిత్రం కోసం ఇక్కడే ఉండడం కన్ఫర్మ్ అయ్యింది.

అయితే అమితాబ్ కి మన టాలీవుడ్ నుంచి ఉన్న అత్యంత సన్నిహితుల్లో కింగ్ నాగార్జున కూడా ఒకరని తెలిసిందే. మరి ఇప్పుడు అమితాబ్ మరియు నాగ్ లు కలిసి గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో భాగంగా కలిసి కనిపించడం జరిగింది. ప్రస్తుతం ఇవే సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

మరి ప్రస్తుతం ప్రభాస్ సినిమా నుంచి చిన్న బ్రేక్ లో అమితాబ్ ఈ ఛాలెంజ్ ని కంప్లీట్ చేశారు. ఇక ఈ భారీ చిత్రంలో అమితాబ్ తో పాటు బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపికా పదుకొనె నటిస్తుండగా వైజయంతీ మూవీస్ వారు ఇండియాలోనే అత్యంత ఖరీదైన సినిమాగా దీనిని నిర్మిస్తున్నారు.

సంబంధిత సమాచారం :