‘బిగ్ బాస్’ తో వారికి ఎంటర్టైన్మెంట్ ఇవ్వడమే టార్గెట్ – నాగ్

Published on Sep 3, 2021 8:00 pm IST


ఒక్క మన దేశంలోనే కాకుండా మొత్తం ప్రపంచ వ్యాప్తంగా కూడా హిట్ అయిన బిగ్గెస్ట్ రియాలిటీ షో ఏదన్నా ఉంది అంటే అది బిగ్ బాస్ షో అని చెప్పాలి. మరి మన దేశంలో ఈ షో మొత్తం 7 భాషల్లో ఏకంగా 37 సీజన్లను కంప్లీట్ చేసుకుంది. అయితే ఇన్ని భాషల్లో ఇన్ని సీజన్లలో అతి పెద్ద హిట్ మాత్రం మన తెలుగు నుంచే అని చెప్పాలి.

మొట్టమొదటి లాంచ్ ఎపిసోడ్ కి గాని అలాగే ఫినాలే ఎపిసోడ్ కి కానీ మన తెలుగు నుంచి వచ్చే రేటింగ్స్ ఇండియాలో ఏ భాషలో కూడా రాలేదు. అందుకే ఈసారి సీజన్ 5 పై కూడా భారీ అంచనాలు నెలకొన్నాయి. మరి ఈ గ్రాండ్ షోకి మరోసారి హోస్టింగ్ చేయనున్న కింగ్ నాగ్ లేటెస్ట్ ఇంటర్వ్యూలో పలు ఆసక్తికర అంశాలు వెల్లడించారు.

తాను ఈ షోలో భాగస్వామ్యం కావడం నిజంగా సంతోషంగా ఉందని ఈసారి కంటెస్టెంట్స్ నుంచి కూడా మంచి ఎంటర్టైన్మెంట్ ని అందించడంలో ఇంకా ఎక్కువ కృషి చేస్తానని అంతే కాకుండా గత కొన్ని నెలలుగా ప్రజలు పడుతున్న ఇబ్బందులు నుంచి రిలీఫ్ ఇచ్చే విధంగా ఎంటర్టైన్మెంట్ ని అందించడమే టార్గెట్ గా అందుకు తగ్గ ప్రయత్నం ఈ షో ద్వారా చేస్తున్నామని నాగ్ తెలిపారు.

మరి ఈసారి కూడా షోని 100 రోజులకి పైగా ప్లాన్ చెయ్యగా గ్రాండ్ ప్రీమియర్స్ సెప్టెంబర్ 5 సాయంత్రం 6 గంటలకి స్టార్ మా ఛానెల్లో స్టార్ట్ కానున్నాయి. సో ఎంటర్టైన్మెంట్ లవర్స్ మీకు కావాల్సిన సాలిడ్ ఎంటర్టైన్మెంట్ ఇంకో రెండు రోజుల్లో అందనుంది బీ రెడీ..

సంబంధిత సమాచారం :