ఆగష్టు 29న రానున్న ‘కిరాక్’

3rd, August 2014 - 07:00:36 AM

Kiraak

యు ట్యూబ్ ద్వారా షార్ట్ ఫిల్మ్ ప్రపంచంలో తన నటనతో, పవన్ కళ్యాణ్ ని బాగా ఇమిటేట్ చేస్తూ పేరు తెచ్చుకున్న అనిరుధ్ హీరోగా వెండి తెరకు పచయమవుతూ చేసిన సినిమా ‘కిరాక్’. హారిక్ దర్శకుడిగా పరిచయమవుతున్న ఈ లవ్ ఎంటర్టైనర్ లో అనిరుధ్ సరసన చాందిని హీరోయిన్ గా కనిపించనుంది. పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు కూడా దాదాపు పూర్తి చేసుకున్న ఈ సినిమాని ఆగష్టు 29న ప్రేక్షకుల ముందుకు తీసుకు రావడానికి సన్నాహాలు చేస్తున్నారు.

సింగల్ షెడ్యూల్ లో షూటింగ్ పూర్తి చేసిన ఈ సినిమా రొటీన్ సినిమాలకు పూర్తి భిన్నంగా ఉంటుందని డైరెక్టర్ హారిక్ అంటున్నాడు. గంగపట్నం శ్రీధర్ నిర్మిస్తున్న ఈ సినిమాకి అజయ్ అరసాద మ్యూజిక్ డైరెక్టర్ గా పనిచేస్తున్నాడు. షార్ట్ ఫిల్మ్ ద్వారా మెప్పించిన హారిక్ ఈ సినిమాతో ఎంతవరకూ తెలుగు ప్రేక్షకులను మెప్పిస్తాడు అనే దానికోసం కొంతకాలం వేచి చూడాల్సిందే..