మూడు రోజుల్లోనే లాభాల్లోకి వెళ్లిన ‘కిరాక్ పార్టీ ‘ !

యంగ్ హీరో నిఖిల్ నటించిన ‘కిరాక్ పార్టీ’ చిత్రం గత శుక్రవారం విడుదలై అన్ని ఏరియాల్లో మంచి ఓపెనింగ్స్ రాబట్టుకుంది. పెద్ద సినిమలీవే లేకపోవడం, ప్రీ రిలీజ్ బజ్ ఉండటంతో ఈ కలెక్షన్స్ సాధ్యమయ్యాయి. తొలిరోజే ప్రపంచవ్యాప్తంగా రూ. 6.18 కోట్ల గ్రాస్ ను రాబట్టింది. ఈ గ్రాస్ రెండు రోజులకు రూ.10 కోట్లకు చేరుకుంది.

ట్రేడ్ వర్గాల సమాచారం మేరకు మూడు రోజులకు గాను ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా రూ.5.25 కోట్ల షేర్ ను రాబట్టింది. వీటికి తోడు ఇప్పటికే శాటిలైట్ హక్కులు రూ.3.25 కోట్లు, హిందీ శాటిలైట్, ఆడియో హక్కులు రూ. 1 కోటి, డివైడ్, డిజిటల్ రైట్స్ యొక్క రూ.55 లక్షలు కలుపుకుంటే మేకర్స్ రూ.10 కోట్లతో బ్రేక్ ఈవెన్ పాయింట్ దాటేశారు.