ఫ్యామిలీస్ అందరూ వచ్చి మా సినిమా చూస్తున్నారు – కిరణ్ అబ్బవరం

Published on Aug 8, 2021 6:05 pm IST

విడుదల అయిన అన్ని థియేటర్ల లో హౌజ్ ఫుల్ కలెక్షన్స్ తో దూసుకుపోతుంది SR కళ్యాణ మండపం చిత్రం. ఈ చిత్రం లో కిరణ్ అబ్బవరం మరియు ప్రియాంక జవాల్కర్ లు హీరో హీరోయిన్ లుగా నటించారు. సాయి కుమార్, శివమణి కీలక పాత్రల్లో నటించిన ఈ చిత్రానికి శ్రీధర్ గాదె దర్శకత్వం వహించారు. ఆగస్ట్ 6 న విడుదల అయిన ఈ చిత్రం ఊహించని విజయం సాధించింది అని చెప్పాలి. అంతేకాక పాజిటివ్ టాక్ సొంతం చేసుకోవడం తో మరిన్ని థియేటర్ల ను కూడా పెంచడం జరిగింది. అయితే చిత్ర యూనిట్ ఈ మేరకు సమావేశం ఏర్పాటు చేసి, తమ ఆనందాన్ని పంచుకోవడం జరిగింది.

ఈ సినిమా లో హీరో పాత్రలో నటించిన కిరణ్ అబ్బవరం మాట్లాడుతూ, థియేటర్స్ యజమానులకు, డిస్ట్రిబ్యూటర్స్, ఎగ్జిబిటర్స్, అందరూ ఈ ప్యాండమిక్ పరిస్థితుల్లో కూడా మమ్మల్ని నమ్మి మా సినిమా విడుదల చేసినందుకు వారందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను అని అన్నారు. మంచి సినిమా వస్తే ప్రేక్షకులు ఎప్పుడూ ఆదరిస్తారని మా సినిమా ద్వారా మరోసారి నిరూపించారు అని వ్యాఖ్యానించారు. ఫ్యామిలీస్ అందరూ వచ్చి మా సినిమా చూస్తున్నారు అని, చాలా మంది కొడుకులు వల్ల నాన్న పై ఉన్న ప్రేమను వ్యక్త పరచలేరని, ఈ సినిమా ద్వారా మాలోని ఆలోచనలను మీరు కళ్ళకు కట్టినట్లు చూపించారని చాలా మంది నాకు ఫోన్స్ చేసి కంగ్రాట్స్ చెపుతున్నారు అంటూ చెప్పుకొచ్చారు. ప్రపంచ వ్యాప్తంగా చూసిన ప్రతి ఒక్కరికీ మా సినిమా కనెక్ట్ అయ్యినందుకు చాలా సంతోషంగా ఉంది, ఈ ప్యాండమిక్ పరిస్థితుల్లో లో కూడా మా సినిమా ఆదరించిన ప్రేక్షకులందరికీ మా టీం తరుపున ధన్యవాదాలు తెలుపుతున్నానని అన్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారందరూ ఈ చిత్రం ఇంత గొప్ప విజయం సాదించడానికి కారణమైన ప్రేక్షకులకు ధన్యవాదాలు తెలిపారు.

సంబంధిత సమాచారం :