‘సమ్మతమే’ ఫస్ట్‌లుక్‌ పోస్టర్‌ బాగుందిగా..!

Published on Jul 15, 2021 8:31 pm IST

యంగ్ హీరో కిరణ్‌ అబ్బవరం, హీరోయిన్ చాందినీ చౌదరి కలయికలో గోపీనాథ్‌ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కుతున్న మ్యూజికల్ రొమాంటిక్‌ ఎంటర్‌టైనర్‌ ‘సమ్మతమే’. యూజీ ప్రొడక్షన్స్‌ పతాకంపై కె. ప్రవీణ నిర్మిస్తున్న ఈ చిత్రం ఇప్పటికే 80 శాతం షూటింగ్‌ను పూర్తి చేసుకుంది. నేడు కిరణ్‌ అబ్బవరం పుట్టిన రోజు సందర్భంగా చిత్ర యూనిట్ ‘సమ్మతమే’ సినిమా ఫస్ట్‌లుక్‌ పోస్టర్‌ను విడుదల చేశారు.

ఈ పోస్టర్‌లో కిరణ్‌ ఓ ఇంటి ముందు వరండాలో కూర్చుని అద్దంలో తనను తాను చూసి నవ్వుకుంటూ కనిపించాడు. పక్కనే ఓ స్తంబాన్ని పట్టుకుని నిలబడ్డ చాందినీ చౌదరి చీరకట్టులో కనిపించింది. పల్లెటూరి వాతావరణం ఉట్టిపడేలా కనిపిస్తున్న ఈ పోస్టర్ ప్రతి ఒక్కరిని ఆకట్టుకునేలా ఉంది. ఇకపోతే ఈ చిత్రానికి శేఖర్‌ చంద్ర సంగీతం అందిస్తున్నారు. త్వరలోని ఈ సినిమా షూటింగ్ పూర్తి చేసి ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని చిత్ర యూనిట్ భావిస్తుంది.

సంబంధిత సమాచారం :