అది ఒకే అయితే కియారా అదృష్టం పండినట్లే…!

Published on Aug 7, 2019 11:07 am IST

కియారా అద్వానీ వరుసగా క్రేజీ ఆఫర్స్ అందుకుంటూ కెరీర్ ని పరుగులుపెట్టిస్తుంది. తాజాగా కబీర్ సింగ్ చిత్రంతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న కియారా నాలుగు హిందీ చిత్రాలలో నటించనున్నారు. వాటిలో అక్షయ్ కుమార్ హీరోగా చేస్తున్న “గుడ్ న్యూస్”,”లక్ష్మీ బాంబ్” వంటి చిత్రాలు ఉండటం గమనార్హం. తాజాగా ఆమె తెలుగులో రామ్ చరణ్ సరసన “వినయ విధేయ రామ” చిత్రంలో నటించారు. గతంలో మహేష్ సరసన “భరత్ అనే నేను” చిత్రంలో నటించడం జరిగింది. ఐతే ఆమె తాజాగా సౌత్ లో ఓ క్రేజీ ఆఫర్ పట్టేశారని సమాచారం.

తమిళ సూపర్ స్టార్ తలపతి విజయ్,దర్శకుడు లోకేష్ కనకరాజ్ డైరెక్షన్ లో చేయనున్న తన 64వ చిత్రానికి గాను హీరోయిన్ గా కియారా పేరును పరిశీలిస్తున్నారని కోలీవుడ్ లో ప్రముఖంగా వినిపిస్తున్న వార్త. ఇదే కనుక జరిగితే కియారా తన కోలీవుడ్ ఎంట్రీని ఘనంగా ప్రారంభించినట్లే. ఇప్పటివరకు కియారా సౌత్ లో కేవలం తెలుగు సినిమాలలో మాత్రమే నటించారు. విజయ్ తో కనుక ఈ ప్రాజెక్ట్ ఒకే అయితే ఆమె నటించే మొదటి తమిళ చిత్రం ఇదే అవుతుంది. దీనిపై అధికారిక ప్రకటన వస్తే మాత్రం కియారా మంచి అవకాశం దక్కించుకొన్నట్లే.

కాగా ప్రస్తుతం హీరో విజయ్ యంగ్ డైరెక్టర్ అట్లీ తో చేస్తున్న “బిగిల్” చిత్రంలో ఫుట్ బాల్ కోచ్ గా అలాగే మరో మూడు విభిన్న గెటప్స్ లో కనిపించనున్నారు. షూటింగ్ కూడా పూర్తిచేసుకున్న ఈ చిత్రం పోస్ట్ ప్రొడక్షన్ దశలో ఉందని సమాచారం. ఏ ఆర్ రెహమాన్ మ్యూజిక్ అందిస్తున్న ఈ చిత్రం దీపావళి కానుకగా విడుదల కానుంది.

సంబంధిత సమాచారం :