సీనియర్ దర్శకులు కోడి రామ కృష్ణ ఇకలేరు !

సీనియర్ దర్శకులు కోడి రామ కృష్ణ ఇకలేరు !

Published on Feb 22, 2019 3:08 PM IST

kodiramakrishan1

ఎన్నో అద్భుతమైన సినిమాలను అందించిన సీనియర్ దర్శకులు కోడి రామ కృష్ణ ఇకలేరు. తీవ్ర అనారోగ్య కారణంగా గచ్చిబౌలి లోని ఏఐజి హాస్పిటల్ లో చేర్చిన విషయం తెలిసందే. వెంటిలేటర్ మీద చికిత్స అందించిన ఆయనఆరోగ్యం కుదట పడలేదు. ఆయన తిరిగి రాని లోకాలకు వెళ్లిపోయారు.

ఆయన చిరంజీవి హీరోగా ‘ఇంట్లో రామయ్య వీధిలో కృష్ణయ్య’ సినిమాతో దర్శకుడయ్యారు. మొదటి సినిమాతోనే గోల్డెన్ జూబ్లీ హిట్ అందుకున్నారు. బాలకృష్ణకు ‘మంగమ్మ గారి మనవడు’తో సోలో హీరోగా మొదటి సక్సెస్ అందించిన ఘనత కూడా కోడి రామకృష్ణకే దక్కింది. ఆయన అందించిన భక్తి చిత్రాల్లో ‘అమ్మోరు’, ‘దేవి’, ‘దేవుళ్లు’, హార్రర్ చిత్రాలల్లో ‘అరుంధతి’ టాలీవుడ్‌లో పెద్ద ట్రెండ్ సెట్టర్‌గా నిలిచాయి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు