“నాటు నాటు” కి స్టెప్పులేసిన కింగ్ కోహ్లీ!

Published on Mar 18, 2023 2:08 am IST

RRR నుండి బ్లాక్‌బస్టర్ ట్రాక్ నాటు నాటు కి వరల్డ్ వైడ్ గా సూపర్ క్రేజ్ ఏర్పడింది. ఈ పాట బెస్ట్ ఒరిజినల్ సాంగ్ విభాగంలో ప్రతిష్టాత్మక ఆస్కార్ అవార్డును అందుకుంది. కీరవాణి, రాహుల్ సిప్లిగంజ్, కాల భైరవ, చంద్రబోస్ మరియు దానితో సంబంధం ఉన్న ప్రతి ఒక్కరూ ప్రపంచవ్యాప్తంగా ప్రశంసలు అందుకుంటున్నారు.

ఈరోజు ఆస్ట్రేలియా పర్యటనలో భాగంగా భారత్, ఆస్ట్రేలియాల మధ్య జరుగుతున్న తొలి వన్డే మ్యాచ్‌లో క్రికెట్ కింగ్ విరాట్ కోహ్లీ స్లిప్స్‌లో ఫీల్డింగ్ చేస్తూ నాటు నాటు పాటకి స్టెప్పులు వేశాడు. ఆ వీడియో కాస్తా వైరల్‌గా మారింది. ఈ క్లిప్‌ను RRR ప్రొడక్షన్ హౌస్ డివివి ఎంటర్టైన్‌మెంట్స్ షేర్ చేసింది. ఇది నాటు నాటు ఫ్యాన్స్ నుండి అందరి అభిమానాన్ని పొందుతోంది. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ మరియు యంగ్ టైగర్ ఎన్టీఆర్ తమ అద్భుతమైన డ్యాన్స్‌లతో క్రికెట్ కింగ్‌ని కూడా ఆశ్చర్యపరిచారు.

సంబంధిత సమాచారం :