క్రేజీ బజ్ : SSMB28 తో క్లాష్ కానున్న కోలీవుడ్ పాన్ ఇండియన్ మూవీ ?

క్రేజీ బజ్ : SSMB28 తో క్లాష్ కానున్న కోలీవుడ్ పాన్ ఇండియన్ మూవీ ?

Published on Nov 6, 2022 2:06 AM IST

ప్రస్తుతం సూపర్ స్టార్ మహేష్ బాబు తో మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ తీస్తున్న హై ఆక్టేన్ యాక్షన్ ఎంటర్టైనర్ SSMB28 మూవీ ఇప్పటికే ఒక షెడ్యూల్ ని జరుపుకుని అతి త్వరలో సెకండ్ షెడ్యూల్ కి రెడీ అవుతోంది. మహేష్ బాబు ఈమూవీ లో పక్కా మాస్ రోల్ చేస్తుండగా పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తోంది. థమన్ మ్యూజిక్ అందిస్తున్న ఈ మూవీని హారికా హాసిని క్రియేషన్స్ వారు నిర్మిస్తున్నారు. కాగా ఈ మూవీని 2023 సమ్మర్ కానుకగా ఏప్రిల్ 28న విడుదల చేస్తున్నట్లు ఇప్పటికే మేకర్స్ అధికారికంగా ప్రకటించారు.

ఇటీవల కోలీవుడ్ లో తెరకెక్కిన భారీ పాన్ ఇండియన్ మూవీ పొన్నియన్ సెల్వన్ 1 పలు భాషల్లో రిలీజ్ అనంతరం భారీ విజయం అందుకున్న విషయం తెలిసిందే. అయితే విషయం ఏమిటంటే, పొన్నియన్ సెల్వన్ 1 కి కొనసాగింపుగా రానునున్న పార్ట్ 2 మూవీని 2023 సమ్మర్ లో ఏప్రిల్ 28న గ్రాండ్ గా రిలీజ్ చేయడానికి దర్శక నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నట్లు లేటెస్ట్ కోలీవుడ్ బజ్. మణిరత్నం ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న ఈ మూవీ కనుక ఒకవేళ అదే రోజున రిలీజ్ అయితే, పక్కాగా బాక్సాఫీస్ వద్ద SSMB28 తో క్లాష్ ఖాయం అంటున్నారు విశ్లేషకులు. మరి అదే కనుక జరిగితే పొన్నియన్ సెల్వన్ కి తెలుగులో అలానే మహేష్ మూవీకి అటు తమిళ్ లో థియేటర్స్ పరంగా కొంత సమస్యలు తలెత్తే అవకాశం ఉందని అంటున్నారు. మరి పక్కాగా పొన్నియన్ సెల్వన్ 2 రిలీజ్ పై క్లారిటీ రావాలి అంటే దీని రిలీజ్ పై అధికారికంగా ప్రకటన వచ్చే వరకు ఆగాల్సిందే.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు