ఈ ఫస్ట్ ఎవర్ రికార్డుకు అతి చేరువలో భీం.!

Published on Oct 23, 2020 9:11 am IST

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ను కొమరం భీం గా దర్శక ధీరుడు రాజమౌళి తన చిత్రం “రౌద్రం రణం రుధిరం” లేటెస్ట్ టీజర్ తో మాస్ ఫీస్ట్ అంటే ఏంటో మరోసారి ఇండియన్ ఫిల్మ్ లవర్స్ కు రుచి చూపించారు. మొదట అల్లూరిగా చరణ్ టీజర్ తో అద్భుతం చూపిన జక్కన తారక్ ను భీం గా చూపించి తుఫాను సృష్టించారు.

ఆ తుఫానును ఇండస్ట్రీ వర్గాల్లో తీవ్ర రూపం చేయడాన్ని మాత్రం యంగ్ టైగర్ అభిమానులు చూసుకుంటున్నారు. ఇప్పటికే వ్యూస్ మరియు లైక్స్ పరంగా ఫాస్టెస్ట్ మరియు భారీ రికార్డులు సృష్టించిన తారక్ అభిమానులు వారు ముందు చెప్పినట్టుగానే మన టాలీవుడ్ లో ఫస్ట్ ఎవర్ 1 మిలియన్ లైక్డ్ టీజర్ గా నిలిపనున్నారు.

ఇప్పటికే 9 లక్షల లైక్స్ మార్క్ ను క్రాస్ చేసిన భీం ఖచ్చితంగా 1 మిలియన్ అందుకోవడం కన్ఫర్మ్ అయ్యిపోయినట్టే అని చెప్పాలి. దీనితో మొట్ట మొదటిసారిగా మన తెలుగు నుంచి 1 మిలియన్ లైక్స్ కలిగిన టీజర్ మరియు హీరోగా యంగ్ టైగర్ ఎన్టీఆర్ తన పేరును లిఖించుకున్నాడు. మరి భీం తుఫాను ఎక్కడ ఆగుతుందో చూడాలి.

సంబంధిత సమాచారం :

More