బ్రహ్మానందం కుమారుడితో కోన వెంకట్ సినిమా.

బ్రహ్మానందం కుమారుడితో కోన వెంకట్ సినిమా.

Published on Aug 14, 2014 12:10 PM IST

goutham-kona-venkat
ఎందరో అగ్ర దర్శకులకు కథలు అందించిన ప్రముఖ రచయిత కోన వెంకట్ అరుదైన రికార్డు క్రియేట్ చేయనున్నారు. దర్శకుడిగా మారుతున్న మరో రచయిత తొలిసినిమాకు కథను అందించనున్నారు. ‘ఆహనా పెళ్ళంట’, ‘పూల రంగడు’, ‘పోటుగాడు’, ‘భీమవరం బుల్లోడు’ సినిమాల డైలాగ్ రైటర్ శ్రీధర్ సీపాన దర్శకుడిగా మారుతున్న సంగతి తెలిసిందే. బ్రహ్మానందం కుమారుడు గౌతమ్ హీరోగా శ్రీధర్ సీపాన దర్శకుడిగా పరిచయం అవుతున్న సినిమాకు కోన వెంకట్ కథను అందిస్తున్నారు. నిర్మాణ భాధ్యతలు కూడా చూసుకుంటున్నట్టు కోన వెంకట్ తెలిపారు.

కోన వెంకట్ సమర్పణలో యంవివి సినిమా పతాకంపై యంవివి సత్యనారాయణ నిర్మించిన ‘గీతాంజలి’ సినిమా గత శుక్రవారం విడుదలైంది. అంజలి, శ్రీనివాస్ రెడ్డి, బ్రహ్మానందం, షకలక శంకర్ ప్రధాన పాత్రలలో నటించారు. హారర్ కామెడీ జోనర్ లో తెరకెక్కిన ఈ సినిమా మంచి విజయం సాదించింది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో కోన వెంకట్ గౌతమ్-శ్రీధర్ సీపాన సినిమాను ప్రకటించారు. వరుసగా సినిమాలు నిర్మించాలనే తాపత్రయం లేదు. మంచి కథతో సినిమాలు చేయాలనుకుంటున్నాం. నెక్స్ట్ గౌతమ్, శ్రీధర్ సీపాన కలయికలో సినిమా నిర్మిస్తున్నాం అని చెప్పారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు