కోన వెంకట్ చేతిలో తమన్నా సినిమా.!

kona-venkat
’బాహుబలి’ సినిమా ద్వారా జాతీయస్థాయిలో పేరు తెచ్చుకున్న మిల్కీ బ్యూటి తమన్నా భాటియా తన కెరీర్ లో తొలిసారిగా ఓ హార్రర్ నేపథ్యంలో వస్తున్న సినిమాలో నటిస్తున్నది. ’అభినేత్రి’ గా తెలుగు, తమిళ్, హిందీ భాషల్లో భారీ బడ్జెట్ తో వస్తున్న ఈ సినిమాలో తమన్నా సరసన ఇండియన్ మైకేల్ జాక్సన్ గా పేరుపొందిన ప్రభుదేవా నటిస్తున్నాడు.

తెలుగు, తమిళ్‌, హిందీ భాషల్లో భారీ బడ్జెట్‌తో రూపొందుతున్న ‘అభినేత్రి’ తెలుగు వెర్షన్‌ ఓవర్సీస్‌ రైట్స్‌ని భారీ మొత్తానికి 9 పిఎం ఎంటర్‌టైన్‌మెంట్‌ సంస్థ స్వంతం చేసుకోగా ఈ సినిమాకి సంభాషణలు అందించిన ప్రముఖ తెలుగు రచయిత కోన వెంకట్ ఈ సినిమా విజయం పై ఉన్న ధీమాతో ఈ చిత్రాన్ని కోన ఫిలిం కార్పొరేషన్‌ సమర్పణలో ఎం.వి.వి. సత్యనారాయణ బ్లూ సర్కిల్‌ కార్పొరేషన్‌, బి.ఎల్‌.ఎన్‌. సినిమాతో కలిసి నిర్మాత మారి తెలుగు ప్రేక్షకుల ముందుకు తీసుకు వస్తున్నారు. అంతే కాకుండా ‘అభినేత్రి’ తెలుగు, తమిళ్‌ ఓవర్సీస్‌ డిస్ట్రిబ్యూషన్‌లో తాను కూడా పాలుపంచుకున్నాడు.

Exit mobile version