‘గబ్బర్ సింగ్ 2’కు కోన వెంకట్ డైలాగ్స్..!

Kona-Venkat3
వరుస పరాజయాల్లో ఉన్న పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రేంజ్, స్టామినాలను బాక్సాఫీస్ వద్ద ఘనంగా చాటి చెప్పిన సినిమా ‘గబ్బర్ సింగ్’. హిందీలో హిట్టయిన ‘దబాంగ్’ రీమేక్ గా సినిమాను రూపొందించినా హీరో క్యారేక్టరైజెషన్, డైలాగ్ డెలివరీ ఇలా ప్రతి విషయంలో పవన్ మార్క్ సుస్పష్టంగా కనిపించింది. ఇప్పుడు ఈ సినిమాకు సీక్వెల్ తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ప్రీ ప్రొడక్షన్ వర్క్స్ చివరిదశకు చేరుకున్నాయి. త్వరలో చిత్రీకరణ ప్రారంభం అవుతుంది.

‘పవర్’ ఫేం కె.రవీంద్ర (బాబీ) దర్శకత్వం వహించబోయే ఈ సినిమాకు ప్రముఖ రచయిత కోన వెంకట్ డైలాగ్స్ రాస్తున్నారు. అనిషా ఆంబ్రోస్‌ ఈ సినిమాలో హీరోయిన్. దేవి శ్రీ ప్రసాద్ సంగీత దర్శకుడు. పవన్ సన్నిహిత మిత్రుడు శరత్ మరార్ క్రేజీ ప్రాజెక్ట్ ను నిర్మిస్తున్నారు. ఎరోస్ ఇంటర్నేషనల్స్, పవన్‌కల్యాణ్ క్రియేటివ్ వర్క్స్, నార్త్‌స్టార్ ఎంటర్‌టైన్‌మెంట్స్ సంయుక్తంగా తెరకేక్కిస్తున్నాయి.

Exit mobile version