మంగళూరులో ఘనంగా ‘కొరగజ్జ’ చలనచిత్ర ఆడియో విడుదల వేడుక

మంగళూరులో ఘనంగా ‘కొరగజ్జ’ చలనచిత్ర ఆడియో విడుదల వేడుక

Published on Nov 13, 2025 7:00 PM IST

Untitled 3 2

కన్నడ నుంచి వస్తున్న మరో రూటెడ్ కథా చిత్రం ‘కొరగజ్జ’ ఆడియో లాంఛ్ ఈవెంట్ మంగళూరులో ఘనంగా జరిగింది. ఇటీవల ‘కాంతార’ చిత్రంతో దేశవ్యాప్తంగా దృష్టిని ఆకర్షించిన భూతకోళం తరహాలోనే, తులునాడులో పూజలందుకునే దైవం కొరగజ్జ కథాంశంతో ఈ చిత్రం రూపొందుతోంది. త్రివిక్రమ సినిమాస్, సక్సెస్ ఫిల్మ్స్ బ్యానర్లపై త్రివిక్రమ్ సాపల్య నిర్మిస్తున్నారు. సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత సుధీర్ అత్తవర్ దర్శకత్వం వహిస్తున్నారు.

కొరగజ్జ థీమ్‌తో నిర్వహించిన ఈ వేడుకలో పాత్రధారులు విభిన్న గెటప్స్‌లో సందడి చేయడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఈ చిత్రానికి గోపీ సుందర్ సంగీతాన్ని అందించగా, షారోన్ ప్రభాకర్, శ్రేయా ఘోషల్, సునిధి చౌహాన్, శంకర్ మహదేవన్, జావేద్ అలీ వంటి ప్రముఖులు పాటలు ఆలపించారు. జీ మ్యూజిక్ ద్వారా ఆడియో మార్కెట్‌లోకి వచ్చింది.

ఈ సందర్భంగా నిర్మాత త్రివిక్రమ్ సాపల్య మాట్లాడుతూ, పోస్టర్, మోషన్ పోస్టర్‌లకు అద్భుతమైన స్పందన వచ్చిందని, త్వరలోనే సినిమాను విడుదల చేస్తామని తెలిపారు. దర్శకుడు సుధీర్ అత్తవర్ మాట్లాడుతూ, ‘కాంతార’ వంటి గొప్ప చిత్రాలను అందించిన కన్నడ పరిశ్రమ నుంచి వస్తున్న ‘కొరగజ్జ’ను అందరూ ఆదరించాలని కోరారు. నటీనటులు శృతి, భవ్య, సందీప్ సొపర్‌కర్ చిత్రంలో తమ పాత్రల గురించి మాట్లాడి, సినిమా విజయంపై విశ్వాసం వ్యక్తం చేశారు. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో ఉన్న ఈ చిత్రాన్ని త్వరలోనే విడుదల చేసేందుకు చిత్రబృందం సన్నాహాలు చేస్తోంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు

వీక్షకులు మెచ్చిన వార్తలు