మెగాస్టార్ చిరంజీవి, కొరటాల శివల చిత్రం త్వరలో సెట్స్ మీదికి వెళ్లనున్న సంగతి తెలిసిందే. మెగా అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్న ఈ ప్రాజెక్ట్ మీద అంచనాలు భారీగా ఉన్నాయి. ఈ చిత్రాన్ని రామ్ చరణ్, నిరంజన్ రెడ్డిలు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ చిత్రాన్ని పాన్ ఇండియా లెవల్లో రూపొందించాలనే ప్లాన్ చేస్తున్నారట. ఒకవేళ ఇదే గనుక నిజమైతే నిర్మాతలు చిరు గత చిత్రం ‘సైరా’ విషయంలో జరిగిన పొరపాటును ఈసారి జరగకుండా చూసుకోవాల్సి ఉంటుంది.
భారీ బడ్జెట్ వెచ్చించి చిరు, చరణ్ ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపొందించిన ‘సైరా’ తెలుగులో బ్రహ్మాండమైన వసూళ్లను రాబట్టింది కానీ హిందీలో మాత్రం ఊహించని రీతిలో వైఫల్యం చవిచూసింది. ఇందుకు ఇతర పెద్ద సినిమాల నుండి ఎదురైన పోటీ
ఒక కారణమైతే చిత్రాన్ని అక్కడి ప్రేక్షకులకు దగ్గరచేయలేకపోయిన టీమ్ వైఫల్యం ఇంకో ప్రధాన కారణం. ఈ వైఫల్యంతో మెగా ఫ్యాన్స్ తీవ్ర నిరుత్సా హానికి గురయ్యారు. పరువు పోయినంత పనైందని ఫీలయ్యారు. కాబట్టి ఈసారి హిందీలో సినిమాను రిలీజ్ చేసే ఆలోచనే ఉంటే కొరటాల, చరణ్ టీమ్ పర్ఫెక్ట్ ప్లానింగ్ చేసి సినిమా భారీ విజయం సాధించేలా చేయాల్సి ఉంటుంది.


