“ఆచార్య”లో కొరటాల మార్క్ ఈ సన్నివేశాలు కూడా.?

Published on Jul 16, 2021 7:04 am IST


ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటిస్తున్న భారీ బడ్జెట్ చిత్రం “ఆచార్య”. బ్లాక్ బస్టర్ దర్శకుడు కొరటాల శివ తెరకెక్కిస్తున్న ఈ చిత్రం ఇపుడు లాస్ట్ స్టేజ్ షూట్ లో ఉంది. ఇక ఇదిలా ఉండగా ఈ చిత్రంలో కొరటాల చాలా సాలిడ్ ఎలెమెంట్స్ లో నింపేసిన సంగతి తెలిసిందే. సంగీతం నుంచి యాక్షన్ సెంటిమెంట్ వరకు కూడా కొరటాల తన మార్క్ చూపించడం ఖాయం అని ఇప్పటికే మనకి తెలిసిందే.

అయితే ఇప్పుడు మరో ఆసక్తికర సమాచారం ఈ చిత్రంపై వినిపిస్తుంది. తన ప్రతీ సినిమాలో కూడా ఏదొక సందేశాత్మక ఎలిమెంట్ ని బలంగా చూపే కొరటాల ఈ చిత్రంలో కొన్ని పొలిటికల్ సన్నివేశాలను సెటైరికల్ గా చూపించనున్నారట. ప్రస్తుత పాలిటిక్స్ సమాజం ను ఎలా విచ్ఛిన్నం చేస్తున్నాయో అన్న కోణంలో కాస్త ఘాటుగానే చూపించే అవకాశం ఉందని గాసిప్స్ వినిపిస్తున్నాయి.

ఇక ఈ సాలిడ్ చిత్రంలో చరణ్ కూడా కీలక పాత్రలో నటిస్తుండగా కాజల్ మరియు పూజా హెగ్డే లు హీరోయిన్స్ గా నటిస్తున్నారు. అలాగే మణిశర్మ సంగీతం అందిస్తున్న ఈ చిత్రానికి మ్యాట్నీ ఎంటర్టైన్మెంట్స్ వారు నిర్మాణం వహిస్తున్నారు.

సంబంధిత సమాచారం :