చరణ్, సోనూ లపై అదిరే సీక్వెన్స్ ప్లాన్ చేసిన కొరటాల.!

Published on Jul 10, 2021 9:00 am IST

మెగాస్టార్ చిరంజీవి హీరోగా కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా బ్లాక్ బస్టర్ దర్శకుడు కొరటాల శివ “ఆచార్య” అనే భారీ బడ్జెట్ సాలిడ్ మల్టీ స్టారర్ చిత్రం చేస్తున్న సంగతి తెలిసిందే. అలాగే ఈ చిత్రంలో మెగాస్టార్ వారసుడు మెగాపవర్ స్టార్ సిద్ధ అనే అదిరే పాత్రలో నటిస్తున్న సంగతి కూడా తెలిసిందే. అయితే ఈ సినిమాలో చరణ్ పాత్ర అత్యంత కీలకం అని ఓ రకంగా చరణ్ పాత్రనే తీసుకెళ్తుంది అని కొరటాల ఇది వరకే తెలిపారు.

మరి వాటికి తగ్గట్టే చరణ్ రోల్ ని కొరటాల అత్యంత శక్తివంతంగా ప్లాన్ చేస్తున్నారని తెలిసింది. అలాగే ఈ చిత్రంలో ప్రముఖ నటుడు సోనూ సూద్ విలన్ రోల్ నటిస్తున్న సంగతి తెలిసిందే.. మరి ఇప్పుడు సోనూ సూద్ మరియు చరణ్ పాత్రల పైనే కొరటాల ఒక అదిరే యాక్షన్ సీక్వెన్స్ ని ప్లాన్ చేసినట్టుగా తెలుస్తుంది.

ఆల్రెడీ చరణ్ తో ఒక రైన్ ఫైట్ ను ప్లాన్ చేసిన కొరటాల ఇప్పుడు వారిద్దరి నడుమ మైండ్ బ్లోయింగ్ కుస్తీ పట్టే సన్నివేశాన్ని తెరకెక్కిస్తున్నారట. చరణ్ బ్లాక్ లో ఇది మరో హైలైట్ అయ్యే అంశం అని తెలుస్తుంది. మొత్తానికి మాత్రం కొరటాల ఎక్కడా తగ్గకుండానే అన్నీ డిజైన్ చేస్తున్నారు. మరి ఈ మెగా మల్టీస్టారర్ ఎంత పెద్ద హిట్టవుతుందో చూడాలి.

సంబంధిత సమాచారం :