ఆచార్య కోసం కొరటాల షూటింగ్ ప్లాన్ !

Published on Sep 28, 2020 11:04 pm IST

సక్సెస్ ఫుల్ డైరెక్టర్ కొరటాల శివ, నవంబర్ నుండి మెగాస్టార్ లేకుండానే ఆచార్య సినిమా షూటింగ్ ప్లాన్ చేస్తున్నాడట. ఇప్పటికే ఈ సినిమా కోసం రామోజీ ఫిల్మ్ సిటీలో ఓ పురాతన దేవాలయం సెట్ కూడా పూర్తయిందని.. కరోనా సోకకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు తీసుకుంటూనే ఆ సెట్ లో షూటింగ్ ను జరపాలని కొరటాల ప్లాన్ అట. కానీ కరోనా ప్రవాహం ముందు భారీ సినిమాల షూటింగ్స్ జరిగే పరిస్థితి లేకుండా పోయిన ఈ పరిస్థితుల్లో కొరటాల ఎలాంటి జాగ్రత్తలు తీసుకుని ఎలా షూట్ చేస్తాడో చూడాలి. ఇక ఈ ‘ఆచార్య’ రాష్ట్రంలోని దేవాలయాలు మరియు అనేక ఇతర మతపరమైన కార్యకలాపాలకు సంబంధించిన అన్యాయాలను అక్రమాలను అరికట్టే శక్తిగా రాబోతున్నాడు.

పైగా మెగాస్టార్ ఈ చిత్రం కోసం బరువు తగ్గడంతో పాటు లుక్ కూడా చేంజ్ చేశారు. యంగ్ గా కనిపించడానికి చాలా మేక్ ఓవర్ కూడా అయ్యారు. ఇక ఈ సినిమాలో మెగాస్టార్ సరసన చందమామ కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తోంది. అన్నట్టు ఈ సినిమాలో దేవాలయాల పేరుతో జరుగుతున్న అవకతవకల పై పోరాటం చేసే ఎండోమెంట్స్ విభాగానికి చెందిన ప్రభుత్వ ఉద్యోగిగా మెగాస్టార్ కనిపిస్తారట. అలాగే రామ్ చరణ్ మాజీ నక్సలైట్ గా కనిపించబోతున్నాడు. చరణ్ పాత్ర ఎమోషనల్ పాత్రగా ఉంటుందని, పైగా ప్రేరణగా నిలుస్తోందట. ఈ చిత్రంలో రెజీనా ఓ స్పెషల్ సాంగ్ లో కనిపించనుంది. రామ్ చరణ్ ఈ సినిమాని నిర్మిస్తున్నారు.

సంబంధిత సమాచారం :

More