కొరటాల శివ-ఎన్టీఆర్ సినిమాకు ముహూర్తం కుదిరింది!

కొరటాల శివ-ఎన్టీఆర్ సినిమాకు ముహూర్తం కుదిరింది!

Published on Oct 8, 2015 2:29 AM IST

Koratala-Siva-ntr
‘మిర్చి’ సినిమాతో అందరి దృష్టినీ ఆకర్షించిన దర్శక-రచయిత కొరటాల శివ, తన రెండో సినిమా ‘శ్రీమంతుడు’తో టాక్ ఆఫ్ ది టాలీవుడ్‌గా మారిపోయారు. ‘శ్రీమంతుడు’తో మహేష్ కెరీర్‌కు మరో బిగ్గెస్ట్ హిట్‌ను అందించి కొరటాల శివ టాప్ డైరెక్టర్స్‌ లిస్ట్‌లో చేరిపోయారు. ఇక ఈ సినిమా తర్వాత వెంటనే యంగ్ టైగర్ ఎన్టీఆర్‌తో సినిమాను లైన్లో పెట్టి మరోసారి ఆకట్టుకునేందుకు సిద్ధం అయిన విషయం తెలిసిందే. శ్రీమంతుడు సినిమాను నిర్మించిన మైత్రీ మూవీ మేకర్స్ సంస్థే ఎన్టీఆర్-కొరటాల శివ సినిమానూ తెరకెక్కించనుంది.

ఇక ఇప్పటివరకూ ఈ సినిమా ఎప్పుడెప్పుడు లాంచ్ అవుతుందా అని ఎదురుచూస్తూన్న అభిమానులకు మైత్రీ మూవీ మేకర్స్ లాంచింగ్ డేట్‌ను అనౌన్స్ చేసింది. అక్టోబర్ 25న ఎన్టీఆర్-కొరటాల శివ కాంబోలో రూపొందే సినిమా లాంచ్ అవ్వనుందని దర్శక నిర్మాతలు తెలిపారు. ప్రస్తుతం ఎన్టీఆర్, సుకుమార్‌తో నాన్నకు ప్రేమతో అనే సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఆ సినిమా పూర్తి కాగానే కొరటాల శివ ప్రాజెక్ట్ సెట్స్‌పైకి వెళ్ళనుంది. మిర్చి, శ్రీమంతుడు.. ఇలా తన రెండు సినిమాల్లోనూ ఓ బలమైన అంశాన్ని స్పృశిస్తూ వచ్చిన శివ, ఎన్టీఆర్‌తో చేసే సినిమాకు ఎలాంటి కథాంశాన్ని ఎంచుకున్నారన్నది ఆసక్తికరంగా కనిపిస్తోన్న అంశం.

తాజా వార్తలు