కొరటాల నిర్మాణంలో వెబ్ సిరీస్ !

Published on Jul 12, 2020 9:40 pm IST

కూల్ అండ్ సక్సెస్ ఫుల్ డైరెక్టర్ కొరటాల శివ ఇప్పుడు కొత్త అవతారం కూడా ఎత్తబోతున్నాడు. నిర్మాతగా తన అభిరుచికి తగ్గ కథాబలం ఉన్న సినిమాలను ఓటీటీ కోసం చేయటానికి సన్నద్ధం అవుతున్నాడు. తన అసిస్టెంట్ కిరణ్ అనే నూతన దర్శకుడికి అవకాశం ఇస్తూ ఓ వెబ్ సిరీస్ ను నిర్మించాలనే ఆలోచనలో ఉన్నాడు కొరటాల. అన్నట్లు ఈ సిరీస్ కి కొరటాలనే స్వయంగా స్క్రిప్ట్ ను రాస్తున్నాడు.

ఇక ప్రస్తుతం కొరటాల దర్శకత్వంలో మెగాస్టార్ హీరోగా ఆచార్య సినిమా రాబోతున్న సంగతి తెలిసిందే. తన శైలిలోనే ఈ సినిమా సాగనుంది. రాష్ట్రంలోని దేవాలయాలతో పాటు అనేక ఇతర మతపరమైన కార్యకలాపాలకు సంబంధించిన ఎండోమెంట్స్ విభాగానికి చెందిన గవర్నమెంట్ ఆఫీసర్ గా మెగాస్టార్ ఈ సినిమాలో కనిపించబోతున్నారు. చరణ్ నిర్మాణంలో వస్తోన్న ఈ సినిమాలో కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తోంది.

సంబంధిత సమాచారం :

More