బన్నీతో సినిమా ప్లాన్ చేస్తున్న ఎన్టీఆర్ డైరెక్టర్ !

Published on Jul 5, 2022 12:30 am IST

క్లాస్ డైరెక్టర్ కొర‌టాల శివ‌, బన్నీతో సినిమా చేయనున్నాడని గతంలోనే వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. అయితే, ఈ సినిమాకి సంబంధించి లేటెస్ట్ గా మరో గాసిప్ వినిపిస్తోంది. ఎన్టీఆర్ తో సినిమా పూర్తి అయిన తర్వాత, కొరటాల బన్నీతోనే సినిమాని ప్లాన్ చేస్తున్నాడని.. 2023 స్టార్టింగ్ లో ఈ సినిమా మొదలయ్యే అవకాశం ఉందని తెలుస్తోంది.

గతంలోనే బన్నీకి కొరటాల ఓ కథ చెప్పాడని, ఆ కథనే ఇప్పుడు సినిమాగా చేయాలనుకుంటున్నాడని తెలుస్తోంది. బన్నీ – కొరటాల కాంబినేషన్ అంటే.. ఈ సినిమా పై భారీ అంచనాలు ఉండే అవకాశం ఉంది. కాగా కొరటాల ఇండ్ర‌స్ట్రీలో ఉన్న ప్ర‌తి స్టార్ హీరోతోనూ ఓ సినిమా చేయాల‌ని ప్లాన్ చేసుకున్నాడు.

అందుకే, జూనియర్ ఎన్టీఆర్ తో చేయబోయే సినిమా అనంతరం, కొరటాల బన్నీతోనే సినిమా చేస్తాడట. హీరోల ఇమేజ్ ను బట్టి కథలు రాసే కొరటాల, బన్నీ కోసం ఎలాంటి కథ రాశాడో చూడాలి.

సంబంధిత సమాచారం :