విజయ్ దేవరకొండ గురించి ఈ స్టార్ డైరెక్టర్ చెప్పింది నిజమేనా ?

Published on Oct 2, 2018 11:36 am IST

రచయితగా కెరీర్ ను మొదలుపెట్టి స్టార్ దర్శకుడిగా ఎదిగిన అతికొద్ది మంది దర్శకుల్లో కొరటాల శివ ఒకరు. స్టార్ హీరోలందరూ ఆయనతో సినిమా చెయ్యటానికి ఇంట్రస్ట్ చూపుతున్నారు. అలాగే కొరటాల కూడా తన తర్వాత సినిమాను, మెగాస్టార్ చిరంజీవితో చేయబోతున్నాడని వార్తలు వస్తున్నాయి. ఇలాంటి నేపథ్యంలో.. నిన్న రాత్రి జరిగిన నోటా ప్రీ రిలీజ్ ఈవెంట్ లో కొరటాల మాట్లాడిన మాటలు, ఓకింత ఆశ్చర్యానికి గురి చేశాయి.

ఎన్టీఆర్, మహేష్ లాంటి స్టార్లే కొరటాలతో సినిమా చెయ్యటానికి ఆసక్తి చూపుతుంటే.. కొరటాల మాత్రం విజయ్ దేవరకొండ కోసం ఓ సబ్జెక్ట్ రాయాలని పెళ్లి చూపులు సినిమా నుంచి.. అంటే నాలుగేళ్ళ నుండి అనుకుంటున్నాడట. కొరటాల రేంజ్ కి, ఆయన నోటా ఈవెంట్ లో మాట్లాడిన మాటలకు అస్సలు సంబంధం లేదని నెటిజన్లు సోషల్ మీడియాలో తెగ కామెంట్లు పెడుతున్నారు.

ఇంతకీ నోటా ప్రీ రిలీజ్ ఈవెంట్ లో కొరటాల ఏం మాట్లాడాడంటే ‘ఇలాంటి డిఫెరెంట్ సినిమా తీసినందుకు నిర్మాత జ్ఞానవేల్ రాజా గారికి కంగ్రాట్స్. పెళ్లి చూపులు చూసినప్పుడు విజయ్ గారికి ఓ స్క్రిప్ట్ రాయాలనుకున్నాను. ఆ తర్వాత అర్జున్ రెడ్డి చూసినప్పుడు ఈయనకు ఎలాంటి స్క్రిప్ట్ రాయాలో అని భయం వేసింది. మళ్లీ గీత గోవిందం చూశాను అని విజయ్ ని చూస్తూ.. ఎప్పటికప్పుడు చిన్న కన్ ఫ్యూజన్ లో పెడుతున్నారు సర్ మీరు. ఇప్పుడు నోటా చుసాను. ఐ ప్రామిస్ యు మంచి స్క్రిప్ట్‌తో మీ దగ్గరికి వస్తాను నేను. తప్పకుండా ఈ సినిమా హిట్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను’ అని కొరటాల చెప్పుకొచ్చారు. మరి కొరటాల నిజంగానే విజయ్ దేవరకొండతో సినిమా తీస్తాడా అంటే.. అది ఇప్పట్లో సాధ్యమయ్యేలా కనిపించట్లేదు.

సంబంధిత సమాచారం :