మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ నటిస్తున్న సరికొత్త చిత్రం ‘కొరియన్ కనకరాజు’ టాలీవుడ్‌లో మంచి అంచనాలను క్రియేట్ చేస్తోంది. ప్రస్తుతం ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. దర్శకుడు మేర్లపాక గాంధీ ఇండియా-కొరియా సంస్కృతుల నేపథ్యంలో ఒక వినూత్నమైన హారర్ కామెడీ కథాంశంతో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు. ప్రముఖ నిర్మాణ సంస్థ యూవీ క్రియేషన్స్ ఈ సినిమాను ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తోంది.
ఈ చిత్రానికి స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ థమన్ సంగీతం అందిస్తుండగా, ఇప్పటికే విడుదలైన ‘కంసహంనిద’ సింగిల్ సోషల్ మీడియాలో చార్ట్‌బస్టర్‌గా నిలిచింది. ప్రస్తుత సినిమా మార్కెట్ ఒడిదొడుకుల్లో ఉన్నప్పటికీ, ఈ చిత్రం భారీ రేటుకు నాన్-థియేట్రికల్ డీల్స్ క్లోజ్ చేసుకోవడం విశేషం. కథపై ఉన్న నమ్మకంతో పాటు వరుణ్ తేజ్ మార్కెట్ స్టామినాకు ఇది నిదర్శనంగా నిలిచింది.
ఇక ఈ సినిమాను ఆగస్టు 7న విడుదల చేసేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. దీనికోసం త్వరలోనే భారీ ప్రమోషన్స్ ప్రారంభించనున్నారు. ఈ చిత్రంలో వరుణ్ తేజ్ నటన ఎంతో వినోదాత్మకంగా, గుర్తుండిపోయేలా ఉంటుందని ఇండస్ట్రీ టాక్. మేర్లపాక గాంధీ తన గత చిత్రాల కంటే భిన్నంగా, ఒక సరికొత్త హారర్ కామెడీతో ప్రేక్షకులను నవ్వించడానికి సిద్ధమవుతున్నాడు.


