బాలయ్య సినిమాకి షూటింగ్ కి బ్రేక్ !

Published on Feb 22, 2021 2:00 pm IST

మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను దర్శకత్వంలో నట సింహం బాలయ్య బాబు హీరోగా రాబోతున్న సినిమా షూటింగ్ ప్రస్తుతం వికారాబాద్‌ మండలం కొటాలగుడెం గ్రామంలో జరుగుతుంది. అయితే తమ గ్రామ పరిధిలో సినిమా చిత్రీకరణ చేయరాదని, తమ భూములు పాడవుతున్నాయని కొటాలగూడ గ్రామస్తులు షూటింగ్ అడ్డుకున్నారట. షూటింగ్ వల్ల తమ పంట పొలాలు దెబ్బతింటున్నాయని వారు షూటింగ్ అడ్డుకున్నారట.

కాగా ఈ చిత్రాన్ని మిర్యాల రవీందర్ రెడ్డి నిర్మించనుండగా సంగీత దర్శకుడు తమన్ సంగీతం సమకూరుస్తున్నారు. ఇక బాలయ్యకు ‘సింహ’ రూపంలో పెద్ద హిట్ ఇచ్చిన బోయపాటి ఆ తర్వాత దాన్ని మించి ‘లెజెండ్’ విజయాన్ని అందించారు. కాబట్టి ఈసారి ‘లెజెండ్’ను మించిన హిట్ పడాలని ఫ్యాన్స్ ఆశిస్తున్నారు. బాలయ్య కూడా జయాపజయాలతో సంబంధం లేకుండా వరుస సినిమాలతో ఫుల్ బిజీ అవుతున్నారు.

సంబంధిత సమాచారం :

More