యూట్యూబ్‌లోకి మాస్ మహారాజా బస్టాండ్ ఫైట్..!

Published on Jul 2, 2021 2:17 am IST


మాస్ మ‌హారాజా ర‌వితేజకు పోలీస్ గెటప్ బాగా సెట్ అవుతుంది కదండీ. యూనిఫాంలో రవితేజ మీసాలు మెలేస్తూ, పవర్‌ఫుల్ డైలాగ్స్‌ను గుక్క తిప్పుకోకుండా చెప్పేస్తూ, రౌడీలను చితక్కొడుతుంటే ఉంటదీ నా సామీ రంగా.. అబ్బో మాటల్లో చెప్పలేం..! ఇదిలా ఉంటే రవితేజ హీరోగా దర్శకుడు గోపీచంద్ మలినేని దర్శకత్వంలో యాక్షన్‌ థ్రిల్లర్‌ ‘క్రాక్‌’ సినిమా వచ్చిన సంగతి తెలిసిందే.

ఈ ఏడాది సంక్రాంతి కానుకగా వచ్చిన ఈ సినిమా పాజిటివ్ రెస్పాన్స్‌ను తెచ్చుకోవడమే కాకుండా మంచి కలెక్షన్లను రాబట్టి బ్లాక్ బస్టర్ హిట్‌గా నిలిచింది. ప్రస్తుతం ఈ సినిమా ఆహాలో ప్రసారం అవుతోంది. అయితే ఈ సినిమాలో బాగా పాపులర్‌ అయిన బస్టాండ్‌ ఫైట్‌ను ఆహా తాజాగా యూట్యూబ్‌లో పంచుకుంది. ఇకపోతే మీరు ఒకవేళ ఇంకా ఈ సినిమాను చూడలేదంటే మాత్రం ఆహాలో చూడండి. ప్రస్తుతానికైతే ఈ బస్టాండ్ ఫైట్‌ను చూసేయండి.

సంబంధిత సమాచారం :