ఈసారి బాలయ్య సరికొత్త టైటిల్ తో వస్తున్నాడా?

Published on Jun 11, 2019 10:31 am IST

సీనియర్ డైరెక్టర్ కె.ఎస్‌.రవికుమార్‌ దర్శకత్వంలో బాలకృష్ణ 105 వ చిత్రం తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. ఓ నెల రోజుల క్రితమే సెట్స్ పైకి వెళ్లాల్సివుండగా కథా మార్పుల విషయమై కొంచెం ఆలస్యమైది. అతిత్వరలోనే ఈ సినిమా షూటింగ్ కూడా మొదలు కానుందని సమాచారం. కాగా తాజాగా దర్శకుడు కె.ఎస్‌.రవికుమార్‌ ఈ మూవీకి టైటిల్ కూడా ఒకటి అనుకున్నారట. “క్రాంతి” అనే ఓ క్లాసిక్ టైటిల్ ఈ మూవీకి పెట్టాలని దర్శకుడు భావిస్తున్నాడని సమాచారం. ఐతే అంతకు ముందు “రూలర్” అనే పవర్ టైటిల్ కూడా ఈ మూవీకి పెట్టనున్నారని ప్రచారం జరిగింది.

ఎన్టీఆర్ బయోపిక్ ఆశించిన మేర ఫలితం రాబట్టకపోవడంతో ఈ చిత్రంతో ఎలాగైనా హిట్టుకొట్టి తన ఫ్యాన్స్ ని ఫిదా చేయాలని చాలా జాగ్రత్తగా ప్లాన్ చేస్తున్నాడట బాలయ్య . ఈ మేరకు స్క్రిప్ట్ దగ్గరి నుంచి టైటిల్ వరకు అన్నీ ఆసక్తికరంగా ఉండాలని ఆయన అంటున్నారట. దీంతో ఇప్పటికే తయారు చేసిన స్క్రిప్ట్ లో పలు మార్పులు డైరెక్టర్ చేశారట. ఈ మూవీలో బాలయ్య కొంచెం నెగటివ్ షేడ్స్ ఉండే పోలీస్ ఆఫీసర్ లా కనిపిస్తారని వినికిడి. “లక్ష్మీ నరసింహా” మూవీలో బాలయ్య పాత్ర ఇలాంటి పోలికలు కలిగి ఉంటుంది.

సంబంధిత సమాచారం :

More