పవన్ ప్రాజెక్ట్ కు క్రిష్ సాలిడ్ ప్లానింగ్స్.?

Published on Oct 1, 2020 7:03 am IST

ప్రస్తుతం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా పలు ప్రాజెక్టులను ఓకే చేసారు. వాటిలో మన టాలీవుడ్ విలక్షణ దర్శకుడు క్రిష్ జాగర్లమూడి తెరకెక్కించనున్న భారీ పాన్ ఇండియన్ ప్రాజెక్ట్ కూడా ఒకటి. పర్టిక్యులర్ గా ఈ ఒక్క ప్రాజెక్ట్ ను పవన్ అభిమానులు ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొన్నారు.

ఎందుకంటే క్రిష్ లాంటి దర్శకుడు అందులోనూ ఇది వరకు పవన్ టచ్ చేయని జానర్ కావడంతో ఈ చిత్రంపై భారీ అంచనాలు పెట్టుకున్నారు. అయితే ఈ చిత్రానికి క్రిష్ సాలిడ్ ప్లానింగ్స్ వేస్తున్నారని ఇపుడు టాక్ వినిపిస్తుంది. ఇప్పటికే ఈ చిత్రాన్ని పాన్ ఇండియన్ ప్రాజెక్ట్ గా తెరకెక్కించడం ఖరారు అయ్యిందని వార్తలు వినిపించాయి.

ఇక అందులో భాగంగా మరింత స్థాయిలో ఇతర ఇండస్ట్రీలలో నటులను క్రిష్ ఎంపిక చేసే యోచనలో ఉన్నారట. అంతే కాకుండా లిమిటెడ్ బడ్జెట్ లోనే మంచి అవుట్ ఫుట్ తీసుకొని రానున్నారట. ప్రస్తుతం పవన్ చేస్తున్న “వకీల్ సాబ్” అనంతరం వెంటనే ఈ చిత్రం షూట్ ను ప్రారంభించి సాధ్యమైనంత త్వరగా ముగించనున్నారు.

సంబంధిత సమాచారం :

More