పవన్ కోసం యాక్షన్ సీక్వెన్స్ ప్లాన్ లో క్రిష్ !

Published on Jul 11, 2021 1:01 am IST

పవన్ – క్రిష్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న సినిమా పవన్ కెరీర్ లోనే భారీ బడ్జెట్ మూవీగా రాబోతున్న ‘హరిహర వీరమల్లు’ సినిమా యాక్షన్ సీక్వెన్స్ ను వచ్చే వారం నుండి ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. పది రోజులు పాటు సాగే ఈ షూట్ లో సీన్స్ ఇంటర్వెల్ లో వస్తాయట. కాగా మొఘల్ కాలం నాటి ఫిక్షన్ కథతో తెరకెక్కుతున్న ఈ సినిమా కోసం ఇప్పటికే భారీ సెట్స్ వేశారు.

ఇక ఈ సినిమాలో జాక్వెలిన్ ఫెర్నాండెజ్ ఓ కీలక పాత్రలో నటిస్తోంది. కాగా ఈ సినిమాని పాన్ ఇండియన్ సినిమాగా తీసుకురానున్నారు. అందుకే క్రిష్ ఈ సినిమాకి మరింత గ్రాండ్ నెస్ ను తీసుకు వచ్చేందుకు పరభాషా నటులను కూడా తీసుకున్నారు. ఇక ప్రముఖ నిర్మాత ఏ ఎమ్ రత్నం మొత్తానికి ఈ సినిమాని భారీగా నిర్మిస్తున్నారు. ఈ పిరియాడికల్ మూవీ వచ్చే సంక్రాంతి బరిలోనే నిలిచే అవకాశం ఉంది.

సంబంధిత సమాచారం :