విక్రమ్, అమీ జాక్సన్ జంటగా సౌత్ ఇండియన్ స్టార్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో రూపొందుతున్న సినిమా ‘ఐ’. 180 కోట్ల భారి నిర్మాణ వ్యయంతో ఆస్కార్ రవిచంద్రన్ నిర్మింన ఈ విజువల్ వండర్ అదే స్థాయిలో బిజినెస్ చేస్తుంది. తెలుగు డబ్బింగ్ హక్కులను 30 కోట్లకు సూపర్ గుడ్ మూవీస్ సంస్థ సొంతం చేసుకుంది. తాజా సమాచారం ప్రకారం కృష్ణ, గుంటూరు థియేటర్ హక్కులు భారి రేటుకు అమ్ముడయ్యాయట. కావేరి ఫిల్మ్స్ కృష్ణ డిస్ట్రిబ్యూషన్ రైట్స్ 2.52 కోట్లు చెల్లించి సొంతం చేసుకోగా, గుంటూరు థియేటర్ రైట్స్ ను 3.25 కోట్లు చెల్లించి మరో డిస్ట్రిబ్యూటర్ సొంతం చేసుకున్నారు.
ప్రస్తుతం ‘ఐ’ సినిమా నిర్మాణంతర కార్యక్రమాలు జరుపుకుంటుంది. స్వర మాంత్రికుడు ఏఅర్ రెహమాన్ స్వరపరిచిన పాటలు తమిళ ప్రేక్షకులను అలరిస్తున్నాయి. ఇంకా తెలుగు ఆడియో విడుదల కాలేదు. తెలుగు, తమిళ, హిందీ భాషలలో ఏకకాలంలో సినిమాను విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఇప్పటికే విడుదలన టీజర్ ప్రేక్షకులలో అంచనాలను పెంచేసింది.


