కృష్ణతో నా స్నేహాన్ని పెంచిన సినిమా – కృష్ణంరాజు

Published on Oct 19, 2020 8:17 pm IST

సూపర్ స్టార్ కృష్ణ, రెబల్ స్టార్ కృష్ణంరాజు ఇద్దరు మంచి స్నేహితులు. కొన్ని ద‌శాబ్దాల పాటు తెలుగు సినీ పరిశ్రమను తమ కను సైగలతోనే ఏలిన స్టార్ హీరోలు. పైగా గతంలో ఇద్దరు కలిసి నటించారు. చాలా చిత్రాలకు ఒకరికి ఒకరు సహకరించుకున్నారు. ఇక ఈ స్టార్స్ చేసిన సూపర్ హిట్ చిత్రాల్లో ‘మనుషులు చేసిన దొంగలు’ అనే సినిమా ఒకటి. కాగా తాజాగా ఈ సినిమా గురించి కృష్ణంరాజు మాట్లాడుతూ.. ఈ చిత్రం బయటకు వచ్చి 43 సంవత్సరాలు. ఎంతో ప్రతిష్టాత్మకమైన జ్ఞాపకాలను సృష్టించింది ఈ సినిమా.

అలాగే కృష్ణతో నా స్నేహాన్ని మరింత బలోపేతం చేసిన చిత్రం కూడా ఇదే అంటూ కృష్ణంరాజు ట్వీట్ చేశారు. కాగా ఈ చిత్రం ఈ రోజుతోటి 43 సంవత్సరాలు పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా ఈ ఇద్దరు స్టార్ హీరోల అభిమానులు అప్పటి ఈ సినిమా గురించి సరదాగా సోషల్ మీడియాలోకామెంట్స్ చేస్తున్నారు. ఎం మల్లికార్జున రావు దర్శకత్వం వహించిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని సాధించింది.

సంబంధిత సమాచారం :

More