డెసిషన్ బాలకృష్ణ, నాగార్జునలకే వదిలేసిన కృష్ణ వంశీ !

Published on May 18, 2019 3:57 am IST

సీనియర్ డైరెక్టర్ కృష్ణ వంశీ ప్రస్తుతం తన నెక్స్ట్ ప్రాజెక్ట్ ‘వందేమాతరం’ పనుల్లో బిజీగా ఉన్నారు. ఎప్పుడూ సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే ఆయన తాజాగా ప్రేక్షకులతో కాసేపు పలు విషయాలపై చర్చించారు. ఆ చర్చల్లో ఒక అభిమాని మీరు ఏఎన్నార్ బయోపిక్ తీయొచ్చు కదా అని అడగ్గా అది డిసైడ్ చేయాల్సింది నాగార్జున అంటూ సమాధానమిచ్చారు.

అలాగే కొన్నాళ్ల క్రితం బాలయ్యతో స్టార్ట్ చేసిన ‘రైతు’ సినిమా గురుంచిన ప్రస్తావన కూడా వచ్చింది.
అప్పట్లో ఈ సినిమాను భారీగా తీయాలనుకున్నారు బాలయ్య, కృష్ణ వంశీ. ఒక పాత్ర కోసం అమితాబ్ వద్దకు కూడా వెళ్లారు. కానీ కొన్ని కారణాల వలన ప్రాజెక్ట్ ఆగిపోయింది. ఇప్పటికీ ముందుకు కదల్లేదు. మళ్ళీ ఆ సినిమాను ఎప్పుడు రీస్టార్ట్ చేస్తారంటూ ఒక నెటిజన్ అడగ్గా అది బాలయ్య చేతిలోనే ఉందంటూ తాను సినిమా చేయడానికి సిద్దంగానే ఉన్నానని సంకేతమిచ్చారు కృష్ణ వంశీ.

సంబంధిత సమాచారం :

More