అధికారికంగా లాంచ్ అయిన ‘రంగమార్తాండ’ !

Published on Nov 26, 2019 12:30 am IST

టాలీవుడ్ క్రియేటివ్ డైరెక్టర్ ‘కృష్ణ వంశీ’ తాజాగా నటసామ్రాట్ అనే మరాఠీ సూపర్ హిట్ సినిమాను తెలుగులో ‘రంగమార్తాండ’గా రీమేక్ చేయబోతున్న సంగతి తెలిసిందే. కాగా తాజాగా ఈ చిత్రం యొక్క అధికారిక ప్రారంభ పూజా కార్యక్రమం, ఈ రోజు హైదరాబాద్‌ లో ఘనంగా జరిగింది. దర్శకుడు తేజ ఈ కార్యక్రమానికి హాజరై చిత్రబృందానికి శుభాకాంక్షలు తెలిపారు. ఈ చిత్రంలో బ్రహ్మానందం కీలక పాత్ర పోషిస్తున్నారు. ఈ సినిమాకు మాస్ట్రో ఇలయరాజా సంగీతం అందించనున్నారు.

కాగా ఒరిజినల్ వెర్షన్ లో నానా పటేకర్ పోషించిన పాత్రను ఈ చిత్రంలో ప్రకాష్ రాజ్ చేస్తుండగా.. ఇక ప్రకాష్ రాజ్ సరసన రమ్యకృష్ణ నటిస్తోంది. కృష్ణవంశీ దాదాపు 20 సంవత్సరాల తరువాత తన సతీమణిని డైరెక్ట్ చేయబోతున్నాడు. ఈ సినిమాని అభిషేక్ అండ్ మధు నిర్మిస్తున్నారు.

అయితే గత కొన్ని సంవత్సరాలుగా ‘కృష్ణ వంశీ’ సినిమాలు మాత్రం బాక్సాఫీస్ వద్ద పెద్దగా విజయం సాధించలేకపోతున్నాయి. మరి ఈ సినిమాతోనైనా మళ్ళీ కృష్ణవంశీ ఫామ్ లోకి వస్తారేమో చూడాలి.

సంబంధిత సమాచారం :