బాక్సాఫీస్ దగ్గర సూపర్ స్ట్రాంగ్ గా “కృష్ణ వ్రింద విహారి”.!

Published on Sep 25, 2022 12:00 pm IST

టాలీవుడ్ యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో నాగ శౌర్య హీరోగా యంగ్ అండ్ టాలెంటెడ్ బ్యూటీ షిర్లే షెటియా హీరోయిన్ గా కొత్త దర్శకుడు అనీష్ కృష్ణ తెరకెక్కించిన లేటెస్ట్ చిత్రం “కృష్ణ వ్రింద విహారి”. ఎప్పుడు నుంచి రిలీజ్ కి రావాల్సి ఉన్న ఈ చిత్రం ఎట్టకేలకి ఈ వారం థియేటర్స్ లోకి రాగా మంచి పాజిటివ్ రెస్పాన్స్ తో స్టార్ట్ అయ్యింది. అయితే ఈ చిత్రానికి బాక్సాఫీస్ దగ్గర మంచి గ్రాఫ్ కనబడుతున్నట్టుగా తెలుస్తుంది.

తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా ఓవర్సీస్ లో కూడా మొదటి రోజు కంటే తర్వాత రోజుల్లోనే వసూళ్లు బాగా పెరిగాయట. ఇక అలాగే యూఎస్ లో అయితే ఫస్ట్ డే చాలా తక్కువ నంబర్స్ తోనే మొదలు కాగా ఇప్పుడు రెండో రోజుకి ప్రీమియర్స్ తో కలిపి సాలిడ్ నెంబర్ కి ఈ చిత్రం వసూళ్లు చేరుకున్నాయి. ఈ చిత్రం ప్రీమియర్స్ మొదటి రోజు అలాగే ఇపుడు రెండో రోజు కలిపితే లక్ష డాలర్స్ ని అందుకుని బాక్సాఫీస్ దగ్గర అదరగొడుతుందనే చెప్పాలి.

సంబంధిత సమాచారం :