మరో రెండు ప్రాజెక్ట్ లను లైన్ లో పెట్టిన కృతి శెట్టి!

Published on Jul 7, 2021 9:23 pm IST

బుచ్చిబాబు సన దర్శకత్వం లో వచ్చిన ఉప్పెన చిత్రం బాక్సాఫీస్ వద్ద కనక వర్షం కురిపించింది. ఈ చిత్రం లో వైష్ణవ్ తేజ్ సరసన హీరోయిన్ గా కృతి శెట్టి నటించింది. మొదటి చిత్రం తోనే ఈ భామ ఫుల్ ఫ్యాన్ ఫాలోయింగ్ ను సంపాదించుకుంది. అంతేకాక ఈ చిత్రం తో క్రేజ్ అమాంతం పెరిగిపోయింది. అయితే ఇప్పటికే న్యాచురల్ స్టార్ హీరో నాని చిత్రం లో మరియు రామ్ పోతినేని చిత్రాల్లో హీరోయిన్ గా నటిస్తున్న కృతి, మరో రెండు చిత్రాలను లైన్ లో పెట్టినట్లు తెలుస్తోంది.

అయితే కృతి శెట్టి యువ కథానాయకుల చిత్రాల్లో నటిస్తూ క్రేజ్ సొంతం చేసుకుంది. అయితే ఇప్పుడు నితిన్ మరొక చిత్రం లో కృతి శెట్టి హీరోయిన్ గా నటిస్తున్నట్లు తెలుస్తోంది. శేఖర్ దర్శకత్వం లో రూపొందుతున్న చిత్రం లో కృతి శెట్టి హీరోయిన్ గా నటిస్తున్నట్లు తెలుస్తోంది. అంతేకాక సోగ్గాడే చిన్ని నాయన చిత్రానికి ప్రిక్వెల్ గా వస్తున్న బంగార్రాజు చిత్రం లో నాగ చైతన్య సరసన హీరోయిన్ గా నటిస్తున్నట్లు తెలుస్తోంది. అయితే వీటి పై ఇంకా అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. అయితే దీని పై కృతి శెట్టి ఎలా స్పందిస్తారో చూడాలి.

సంబంధిత సమాచారం :