హైదరాబాద్ లో షూటింగ్ లో పాల్గొన్న బేబమ్మా

Published on Jul 1, 2021 11:34 pm IST


ఉప్పెన చిత్రం తో యువత మనసు కొల్లగొట్టిన భామ కృతి శెట్టి. మొదటి చిత్రం తోనే భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్న కృతి శెట్టి ను బేబమ్మా గా అభిమానులు పిలుస్తున్నారు. అయితే తాజాగా కృతి శెట్టి హైదరాబాద్ కు చేరుకుంది. ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి అంటూ ఇంద్రగంటి మోహనకృష్ణ సినిమా తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రం లో సుధీర్ బాబు హీరో గా నటిస్తుండగా, హీరోయిన్ గా కృతి శెట్టి నటిస్తోంది. ఈ చిత్రం షూటింగ్ నేటి నుండి హైదరాబాద్ లో ప్రారంభం అయింది.

అయితే ఈ చిత్రం తో పాటుగా రామ్ పోతినేని హీరో గా లింగు స్వామి దర్శకత్వం లో వస్తున్న చిత్రంలో హీరోయిన్ గా నటిస్తుంది. ఈ చిత్రం షూటింగ్ ఇంకా ప్రారంభం కావల్సి ఉంది. అయితే ఉప్పెన చిత్రం తో తన సక్సెస్ ను మొదలు పెట్టిన కృతి వరుస సినిమా లు చేస్తుండటం తో అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. అయితే ఈ రెండు సినిమాల్లో చాలా విభిన్నంగా కనిపించనుంది కృతి.

సంబంధిత సమాచారం :