ఈ ‘సస్పెన్స్ థ్రిల్లర్’ హండ్రెడ్ పర్సెంట్ హిట్ అంటా ?

ఈ ‘సస్పెన్స్ థ్రిల్లర్’ హండ్రెడ్ పర్సెంట్ హిట్ అంటా ?

Published on Mar 24, 2019 10:03 AM IST

షేర్ దర్శకత్వంలో ఇంటర్నేషనల్ మోడల్స్ సమీర్ ఖాన్, శైలజ లను హీరో హీరొయిన్ లుగా పరిచయం చెస్తూ.. చంద్రశేఖరా మూవీస్ పతాకం పై వెంకట్ రెడ్డి నిర్మిస్తున్న చిత్రం “కెఎస్100”. బేబీ పూర్వీ ప్రత్యేక పాత్రలో నటించారు. నవనీత్ చారి సంగీతం అందించిన ఈ చిత్రం ఆడియో మార్చ్ 23న హైదరాబాద్ ఫిల్మ్ ఛాంబర్ లో ఘనంగా జరిగింది.. ఈ కార్యక్రమంలో చిత్రబృందంతో పాటు సుమన్, లయన్ సాయి వెంకట్ తదితరులు పాల్గొన్నారు.. ప్రత్యేక అతిధి భవారి, సాయి వెంకట్ కెఎస్100 ఆడియో సీడీలను రిలీజ్ చేశారు. అనంతరం “కెఎస్100” చిత్రం ప్రోమోస్ ని తెరపై ప్రదర్శించారు..

ఈ సందర్భంగా దర్శకుడు షేర్ మాట్లాడుతూ.. సస్పెన్స్, థ్రిల్లర్, హారర్ జోనర్ లో సినిమా ఉంటుంది. యూత్ కి కావాల్సిన రొమాంటిక్ సన్నివేశాలు కూడా చిత్రం లో ఉన్నాయి. అమ్మాయిలు ప్రస్తుతం సమాజంలో ఏ విధంగా సఫర్ అవుతున్నారు. అనే పాయింట్ తీసుకొని ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాము. ఈ చిత్రం హండ్రెడ్ పర్సెంట్ హిట్ అవుతుంది అన్నారు.

నిర్మాత కె వెంకట రామ్ రెడ్డి మాట్లాడుతూ… షేర్ చెప్పిన స్టోరీ ఇన్స్పైరింగ్ గా ఉండటంతో ఈ సినిమా తీశాను. కమర్షియల్ ఎలిమెంట్స్ అన్నీ ఈ చిత్రంలో ఉంటాయి. తప్పకుండా ఈ చిత్రం అందరికీ నచ్చుతుంది..అన్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు