కె ఎస్ ఫిలిం వర్క్స్ ఆధ్వర్యంలో నిత్యవసర సరుకుల పంపిణీ..!

Published on Jul 22, 2021 10:00 am IST

కరోనా లాక్‌డౌన్ కారణంగా ఉపాధి కోల్పోయి ఇబ్బందులు పడుతున్న దాదాపు 1000 కుటుంబాలకు కె ఎస్ ఫిలిం వర్క్స్ సంస్థ అండగా నిలిచింది. ఈ సంస్థ నుంచి “రిచి గాడి పెళ్లి” అనే టైటిల్‌తో వస్తున్న సినిమా ఇటీవలే షూటింగ్ పూర్తి చేసుకుని విడుదలకు సిద్దంగా ఉంది. ఈ సినిమా షూటింగ్ మొత్తం ఊటీలో జరగడం వలన ఆ పరిసర ప్రాంతాలైన కళ్ళట్టి, మసన గుడి అనే గ్రామాల్లో అవసరం ఉన్న వారికి నిత్యవసర సరుకులను అందించారు.

ఈ సందర్భంగా దర్శకుడు హేమరాజ్ కె.ఎస్ మాట్లాడుతూ “రిచిగాడి పెళ్లి” అనేది మానవ సంబంధాలకు అద్దంపట్టే కథ అని, డిఓపి విజయ్ ఉలగనాథ్ గారు చేసిన వర్క్ చిత్రానికి హైలైట్‌గా నిలుస్తుందని చెప్పుకొచ్చారు. ఈ చిత్రం కోసం పనిచేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నానని అన్నారు. లాక్‌డౌన్ కారణంగా ఉపాధి కోల్పోయి చాలా మంది ఇబ్బందులు పడుతుండడం చూశామని మా వంతుగా ఏదో ఒకటి చేయాలని కొన్ని కుటుంబాలకు నిత్యవసర సరుకుల పంపిణీ చేసినట్టు చెప్పుకొచ్చారు.

సంబంధిత సమాచారం :