ధనుష్ కెరీర్‌లో హయ్యెస్ట్ బడ్జెట్ మూవీగా ‘కుబేర’

ధనుష్ కెరీర్‌లో హయ్యెస్ట్ బడ్జెట్ మూవీగా ‘కుబేర’

Published on Apr 23, 2025 4:07 PM IST

Kubera M

టాలీవుడ్‌లో తెరకెక్కుతున్న చిత్రాల్లో దర్శకుడు శేఖర్ కమ్ముల డైరెక్ట్ చేస్తున్న ‘కుబేర’ ఇప్పటికే మంచి బజ్‌ని క్రియేట్ చేసింది. ఈ సినిమాలో ధనుష్, అక్కినేని నాగార్జున, రష్మిక మందన్న ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. ఇక ఈ సినిమా నుంచి ఇప్పటికే రిలీజ్ అయిన ప్రమోషనల్ కంటెంట్ ప్రేక్షకుల్లో ఈ సినిమాపై సాలిడ్ అంచనాలు క్రియేట్ చేసింది. శేఖర్ కమ్ముల తనదైన మార్క్‌తో ఈ సినిమాను కొత్త పంథాలో తెరకెక్కిస్తున్నాడు.

ఇక ఈ సినిమా ధనుష్ కెరీర్‌లోనే హయ్యెస్ట్ బడ్జెట్ చిత్రంగా నిలిచింది. కుబేర చిత్రాన్ని ఏకంగా రూ.130 కోట్ల బడ్జెట్‌తో రూపొందిస్తున్నారు. ఈ సినిమా కోసం ధనుష్ రికార్డు స్థాయిలో రూ.30 కోట్ల రెమ్యునరేషన్ తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. ఇది ధనుష్ కెరీర్‌లోనే హయ్యెస్ట్ రెమ్యునరేషన్ అని సినీ సర్కిల్స్ టాక్. ఇక మరో కీలక పాత్రలో నటిస్తున్న అక్కినేని నాగార్జున ఈ సినిమా కోసం రూ.14 కోట్లు తీసుకుంటున్నాడట.

అటు అందాల భామ రష్మిక మందన్న ఈ మూవీ కోసం రూ.4 కోట్ల తీసుకుంటుండగా.. సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్ ఈ సినిమా కోసం రూ.3 కోట్ల తీసుకుంటున్నాడట. దీంతో ‘కుబేర’ సినిమా బాక్సాఫీస్ దగ్గర ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేస్తుందా అని అందరూ ఆసక్తిగా చూస్తున్నారు. ఈ సినిమాను జూన్ 20న పలు భాషల్లో రిలీజ్ చేసేందుకు మేకర్స్ రెడీ అవుతున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు