ట్విస్టులతో ఆసక్తి రేపుతున్న “కుడి ఎడమైతే” ట్రైలర్

Published on Jul 14, 2021 10:52 pm IST

ఆన్లైన్ వేదిక గా ప్రేక్షకులని అలరించేందుకు వస్తున్న వెబ్ సిరీస్ కుడి ఎడమైతే. ఈ వెబ్ సిరీస్ కోసం తెలుగు నాట ప్రేక్షకులు, అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు. రామ్ విఘ్నేష్ దర్శకత్వం వహించిన ఈ సీరీస్ లో అమలా పాల్, ఈశ్వర్ రాచిరాజు, ప్రదీప్ రుద్ర లు ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. అయితే ఈ వెబ్ సిరీస్ కి సంబందించిన ట్రైలర్ తాజాగా విడుదల అయింది.

అయితే ఆహా వీడియో ద్వారా ఈ కుడి ఎడమైతే వెబ్ సిరీస్ ప్రేక్షకులను అందుబాటులో ఉండనుంది. విడుదల అయిన కుడి ఎడమైతే ట్రైలర్ ఆద్యంతం ఆసక్తీ గా కొనసాగింది. ఇందులో ఎన్నో ట్విస్ట్ లతో మంచి థ్రిల్లర్ లా ట్రైలర్ కొనసాగింది. అయితే ప్రేక్షకులకి అన్ని నచ్చే అంశాలు ఈ సీరీస్ లో ఉన్నట్లు తెలుస్తోంది. ఈ కుడి ఎడమైతే జూలై 16 వ తేదీ నుండి ఆహా లో స్ట్రీమ్ కానుంది.

వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి

సంబంధిత సమాచారం :