“కుడి ఎడమైతే” ట్రైలర్ కి ముహూర్తం ఫిక్స్..!

Published on Jul 13, 2021 9:32 pm IST

కుడి ఎడమైతే అంటూ వస్తున్న వెబ్ సిరీస్ పై తెలుగు ప్రేక్షకులు ఎంతో ఆసక్తి చూపుతున్నారు. ఈ వెబ్ సిరీస్ కి సంబందించిన పోస్టర్లు, వీడియోలు ఇప్పటికే తెగ వైరల్ అవుతున్నాయి. ఈ వెబ్ సిరీస్ ను రామ్ విఘ్నేష్ క్రియేట్ చేయగా ఇందులో అమలా పాల్, ఈశ్వర్ రచిరాజు, ప్రదీప్ రుద్ర, సూర్య శ్రీనివాస్ లు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. అయితే ఈ వెబ్ సిరీస్ కోసం అంతా ఎదురు చూస్తున్నారు.

కుడి ఎడమైతే కి సంబంధించిన ప్రమోషన్స్ ను చిత్ర యూనిట్ షురూ చేసింది. అయితే ఈ వెబ్ సిరీస్ డైరెక్ట్ గా ఆహా లో విడుదల కానుంది. జూలై 16 వ తేదీన ఆహా లో స్ట్రీమ్ కానుంది. అయితే ఈ వెబ్ సిరీస్ కి సంబందించిన ట్రైలర్ ను రేపు సాయంత్రం 6 గంటలకు విడుదల చేస్తున్నట్లు చిత్ర బృందం ప్రకటించింది. అయితే అందుకు సంబంధించిన పాస్టర్లను సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం జరిగింది.

సంబంధిత సమాచారం :