ఎన్.టి.ఆర్ లాంచ్ చేసే ‘కుమారి 21F’ ఫస్ట్ టీజర్ విశేషాలు.

ఎన్.టి.ఆర్ లాంచ్ చేసే ‘కుమారి 21F’ ఫస్ట్ టీజర్ విశేషాలు.

Published on Sep 30, 2015 8:52 AM IST

kumari-21f

డిఫరెంట్ పాత్రలను సృష్టించి, వాటికి ఓ చిత్రమైన స్క్రీన్‌ప్లే ని జోడించి సినిమాలు తీసి తెలుగులో టాప్ డైరెక్టర్‌‌లలో ఒకరుగా పేరు తెచ్చుకున్న సుకుమార్ ఈ మధ్య నిర్మాతగా వినూత్న సినిమాలను తెరకెక్కించే పనిలో ఉన్నాడు. ఆ కోవలోనే సుకుమార్ తన సొంత బ్యానర్‌పై ‘కుమారి 21F’ అనే సినిమాను నిర్మిస్తున్నారు. ఈ సినిమాకు సుకుమార్ స్వయంగా కథ – స్క్రీన్‌ప్లే అందించడం కూడా విశేషం. పల్నాటి సూర్య ప్రతాప్ దర్శకత్వంలో రూపొందుతోన్న ఈ సినిమాలో వరుస హిట్స్‌తో దూసుకుపోతోన్న రాజ్ తరుణ్ హీరోగా నటించారు. హీబా పటేల్ హీరోయిన్‌గా నటించారు.

షూటింగ్ మొత్తం పూర్తి చేసుకున్న ఈ సినిమాని అక్టోబర్ 30న రిలీజ్ చేసే ఆలోచనలో ఉన్నారని ఇది వరకే తెలియజేశాం. అలాగే ఈ సినిమా ఫస్ట్ లుక్ టీజర్ ని యంగ్ టైగర్ ఎన్.టి.ఆర్ లంచ్ చేస్తాడని ఇది వరకే తెలియజేశాం. తాజాగా ఎప్పుడు అనే విషయంపై క్లారిటీ ఇచ్చారు. అక్టోబర్ 2వ తేదీ మధ్యాహ్నం 3:30 నిమిషాలకు ఎన్.టి.ఆర్ చేతులమీదుగా ఫస్ట్ టీజర్ రిలీజ్ అవుతుంది. సుకుమార్ స్టైల్ నెరేషన్‌తో ఓ సరికొత్త ప్రేమకథగా ఈ సినిమా రూపొందిన ఈ సినిమాకి దేవీశ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందిస్తే, రత్నవేలు సినిమాటోగ్రాఫర్ గా పనిచేసాడు.

తాజా వార్తలు

వీక్షకులు మెచ్చిన వార్తలు