ఆడియో అండ్ ట్రైల‌ర్ లాంచ్‌ లో ‘కురుక్షేత్రం’ !

Published on Jul 25, 2019 2:54 pm IST

మ‌హాభార‌తం లాంటి అత్య‌ద్బ‌త దృశ్య‌ కావ్యాన్ని తొలిసారిగా ఇండియ‌న్ స్క్రీన్‌ మీద 3డిలో చూడ‌బోతున్నాం. ఈ చిత్రంలో యాక్ష‌న్ కింగ్ అర్జున్ క‌ర్ణుడుగా ద‌ర్శ‌న్ దుర్యోధ‌నుడిగా, సోనూసూద్ అర్జునుడిగా, అభిమ‌న్యుడిగా అఖిల్‌ గౌడ్‌, కృష్ణుడిగా ర‌విచంద్ర‌న్ న‌టించ‌గా ద్రౌప‌దిగా స్నేహ న‌టించారు. ఈ చిత్రం ఒకేసారి ఐదుభాష‌ల్లో విడుద‌ల‌వ్వ‌డం విశేషం. మెట్ట‌మెద‌టి సారిగా ప్ర‌పంచంలోనే మైత‌లాజిక‌ల్ 3డి వెర్ష‌న్ గా ఈ చిత్రం తెర‌కెక్కింది. ఈ చిత్రానికి తెలుగు, క‌న్న‌డ బాష‌ల్లో ఎన్నో చిత్రాలు నిర్మించి సౌత్ ఇండియా సన్సెష‌న‌ల్ ప్రోడ్యూస‌ర్ గా పేరుగాంచిన రాక్‌ లైన్‌ వెంక‌టేష్‌ గారు ఈ చిత్రాన్ని స‌మ‌ర్ప‌ణ‌లో, వృష‌భాద్రి ప్రొడ‌క్ష‌న్స్ ప‌తాకం పై ఫ్యాఫ‌న్ తో త‌న ప్రోఫెష‌న్ గా తీసుకుని ఎన్నోచిత్రాలు క‌న్న‌డ‌లో నిర్మించిన మునిర‌త్న (ఎంఎల్ఎ) ఈ చిత్రాన్ని నిర్మించమే కాకుండా ఈ చిత్ర క‌థ‌ని అందించారు.

నాగ‌న్న ద‌ర్శ‌క‌త్వంలో రూపొందిన ఈ చిత్రం ట్రైల‌ర్, ఆడియో లాంచ్‌ బుధ‌వారం ప్ర‌ముఖ నిర్మాత‌లు బివిఎస్ఎన్ ప్ర‌సాద్‌, బ‌న్నీవాసుల చేతుల మీదుగా హైద‌రాబాద్ లో విడుద‌ల చేశారు. ఈ సంద‌ర్భంగా విలేక‌రుల స‌మావేశంలో… బివిఎస్ ఎన్ ప్ర‌సాద్ మాట్లాడుతూ… నేను ఎప్ప‌టి నుంచో భార‌తాన్ని 3డిలో చేయాల‌నుకున్నాను. నేను భావించిన‌ట్లే 3డిలో మొట్ట‌మొద‌టిసారి ఆల్ ఓవ‌ర్ ఇండియాలో ఈ కురుక్షేత్రం విడుద‌ల చేయ‌డం ఆనందంగా ఉంది. టీం అంద‌రికీ నా కృత‌జ్ఞ‌త‌లు.

ట్రైలర్ కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి.

సంబంధిత సమాచారం :