బోర్ ఫీలవుతున్న బన్నీ?

Published on Jul 13, 2020 7:05 am IST

స్టార్ హీరో లైఫ్ అంటే చుట్టూ సిబ్బంది, మీటింగ్ లు, షూటింగ్స్, ఈవెంట్స్ ఇలా క్షణం తీరిక ఉండదు. 365రోజులూ తీరిక లేకుండా గడిపే జీవితంలో ఒక్కసారి నెలలతరబడి గ్యాప్ వస్తే మానసికంగా చాలా ఇబ్బంది కలుగుతుంది. ఏమి చేయాలో తెలియక చిరాకేస్తుంది. ఎంత ఫ్యామిలీతో గడిపినా…ఇష్టమైన వ్యాపకాలతో మునిగిపోయినా అది కొంత సేపే.సమయం గడవాలంటే పని ఉండాల్సిందే. హీరో బన్నీ పరిస్థితి కూడా అలానే ఉందని సమాచారం.

కరోనా వైరస్ కారణంగా పుష్ప మూవీ షూటింగ్ కి బ్రేక్ పడగా…నాలుగు నెలల నుండి ఇంటికే పరిమితం అవుతున్నాడు బన్నీ. మధ్యలో కొన్ని కథలు వింటున్నాడని తెలిసినా, పనిలేక బోర్ ఫీల్ అవుతున్నారట. అందుకే అస్తమానం ఇంటిలో ఉండలేక, ఒక్కడే మార్నింగ్ వాక్ కి, షాపింగ్స్ కి వెళుతున్నాడు. కొన్నిసార్లు వ్యక్తిగత బాడీ గార్డ్స్ ని వెంటబెట్టుకొని రోడ్లపై నడుస్తూ రౌండ్స్ వేస్తున్నాడు. ఎంత త్వరగా సాధారణ పరిస్థితులు ఏర్పడి షూటింగ్ మొదలైతే, అంత మంచిదన్న ఆలోచనలో ఉన్నారట.

సంబంధిత సమాచారం :

More