ల్యాబ్-గ్రోన్ డైమండ్ జ్యువెలరీ బ్రాండ్ ‘లాడియా’ ఖమ్మంలో తమ ఏడో షోరూమ్‌ను ప్రారంభించింది. ఈ నూతన స్టోర్‌ను సినీ నటి నేహా శెట్టి లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా సంస్థ డైరెక్టర్ అఖిల్ వేములూరి మాట్లాడుతూ.. ల్యాబ్-గ్రోన్ డైమండ్స్ రంగంలో భారత్ సాధిస్తున్న పురోగతికి తమ వంతు సహకారం అందిస్తున్నామని, తెలంగాణలో కీలక వ్యాపార కేంద్రమైన ఖమ్మంలో కొత్త స్టోర్ ఏర్పాటు చేయడం సంతోషంగా ఉందని తెలిపారు.
ఈ స్టోర్‌లో ల్యాబ్-గ్రోన్ డైమండ్స్, సాలిటైర్స్‌తో రూపొందించిన నెక్లెస్‌లు, గాజులు, ఉంగరాలు, పోల్కీలు సహా వివిధ రకాల ఆభరణాలు అందుబాటులో ఉంచారు. వినియోగదారులు తమకు నచ్చిన డిజైన్‌ను కస్టమైజ్ చేసుకునే సదుపాయంతో పాటు డైమండ్ గ్రేడింగ్‌లో గుర్తింపు పొందిన ఐజీఐ (IGI) సర్టిఫికేషన్‌ను అందిస్తున్నట్లు నిర్వాహకులు పేర్కొన్నారు. అలాగే 24 క్యారెట్ల పాత బంగారంపై ఫుల్ వాల్యూ ఎక్స్చేంజ్ సదుపాయాన్ని కూడా కల్పిస్తున్నారు.
లాడియా స్టోర్‌లో డైమండ్ ధరలు క్యారెట్‌కు రూ.24,999 (EF-VVS) నుంచి ప్రారంభమవుతాయని ప్రతినిధులు వెల్లడించారు. షోరూమ్ ప్రారంభం సందర్భంగా మే 30 నుంచి జూన్ 14 వరకు పలు ఆఫర్లను ప్రకటించారు. సాలిటైర్ డైమండ్స్‌పై 25 శాతం, సాధారణ డైమండ్స్, మేకింగ్ ఛార్జీలపై 15 శాతం తగ్గింపుతో పాటు జీరో వేస్టేజ్ ఆఫర్ అందుబాటులో ఉంటుందని వివరించారు.


